ETV Bharat / sports

రోహిత్ రాణిస్తే ముంబయిదే టైటిల్: బ్రెట్​లీ - బ్రెట్​లీ తాజా వార్తలు

ఐపీఎల్​లో రోహిత్ శర్మ రాణిస్తే ముంబయి ఇండియన్స్ మరో టైటిల్ గెలుచుకోవడం ఖాయమని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్​లీ. ఈసారి జట్టు సమతూకంతో ఉందని తెలిపాడు.

'The most important thing for Rohit Sharma is firstly to score runs for Mumbai Indians' - Brett Lee
రోహిత్ రాణిస్తే ముంబయిదే టైటిల్: బ్రెట్​లీ
author img

By

Published : Sep 17, 2020, 2:26 PM IST

ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​కు నాలుగు సార్లు ట్రోఫీని అందించి విజయవంతమైన సారథిగా గుర్తింపు పొందాడు రోహిత్ శర్మ. అయితే ఈ లీగ్​లో టోర్నీ ఆసాంతం హిట్​మ్యాన్ ఎపుడూ రాణించలేదు. అంచనాలకు తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అయితే ఈసారి టాపార్డర్​లో రోహిత్ చెలరేగితే ముంబయికి మరోసారి టైటిల్ ఖాయమని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్​లీ.

"రోహిత్ శర్మ తన పవర్​ఫుల్ ఇన్నింగ్స్‌లతో ముంబయికి మంచి ఆరంభాన్ని ఇవ్వాలి. ఈ జట్టు తరఫున రోహిత్ పరుగులు చేయడం చాలా ముఖ్యం. అతను గొప్ప కెప్టెన్ కావచ్చు. కానీ నాయకుడనేవాడు ముందుండి పరుగులు చేస్తూ జట్టుకు అండగా నిలవాలి. అప్పుడు ఇతర ఆటగాళ్లు కూడా రాణిస్తారు. జట్టులో ఉన్న ఇతర ఆటగాళ్లకంటే రోహిత్​కు అనుభవం ఎక్కువ. యూఏఈ పరిస్థితులపై అతడికి అనుభవం ఉంది. అక్కడ మంచి ప్రదర్శనలూ చేశాడు. బ్యాటింగ్​లో రాణిస్తే కెప్టెన్​గా ఒత్తిడి తగ్గుతుంది. ఇతడు బ్యాటింగ్​లో రాణిస్తే ముంబయికి టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి ముంబయి సమతూకంతో ఉంది. ప్లేఆఫ్స్​కు చేరుకుంటుంది."

-బ్రెట్​లీ, ఆస్ట్రేలియా మాజీ పేసర్

ఈనెల 19న ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభంకానుంది. మొదటి మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్​తో తలపడనుంది డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.