ETV Bharat / sports

దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్​కు నేడు భారత జట్టు ఎంపిక - rohit

వచ్చే నెల 2 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది టీమిండియా. ఇందు కోసం జట్టును నేడు ప్రకటించనున్నారు. ఓపెనర్ రాహుల్ విఫలమవుతుండటం వల్ల అతడి స్థానంలో రోహిత్ శర్మకు చోటు దక్కే అవకాశముంది.

టీమిడియా
author img

By

Published : Sep 12, 2019, 6:20 AM IST

Updated : Sep 30, 2019, 7:22 AM IST

కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది.. పుజారా ఫామ్​పైనా అనుమానమే.. రిషభ్ పంత్ ఎంతమేరకు రాణిస్తాడో చెప్పలేం! టెస్టుల్లో భారత్ ఆటగాళ్లపై సగటు అభిమానికున్న సందేహాలివి. అయితే వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో 3 టెస్టుల సిరీస్​ జరగనున్న నేపథ్యంలో నేడు జట్టును ప్రకటించనుంది సెలక్షన్ కమిటీ. ఎవరెవరు చోటు దక్కించుకుంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది.

వెస్టిండీస్​తో టెస్టు సిరీస్​లో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. అతడి స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్​శర్మను​ తీసుకోవచ్చు. టెస్టుల్లో సాధారణంగా మిడిలార్డర్​లో బ్యాటింగ్ చేస్తాడు రోహిత్. అయితే 5, 6 స్థానాల్లో రహానే, హనుమ విహారి నిలకడగా ఆడుతుండటం వల్ల ఓపెనర్​గా అతడ్ని పంపే అవకాశముంది. మూడో స్థానంలో పుజారా, నాలుగులో విరాట్ కొనసాగనున్నారు.

MATCH
రాహుల్

ఓపెనర్లు విఫలమవుతున్న తరుణంలో సెహ్వాగ్ లాంటి విధ్వంసకర బ్యాట్స్​మన్​ కోసం చూస్తున్నారు కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్. ఇలాంటప్పుడు వారికున్న ఏకైక ఆప్షన్ రోహిత్​ను టాప్ ఆర్డర్​లో పంపడమే. దేశవాళీ మ్యాచ్​ల్లో నిలకడగా రాణిస్తున్న బంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్​కూ అవకాశం దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

రాహల్​ ఎంపిక చేయకుండా మయాంక్ అగర్వాల్​ను ఓపెనర్​గా కొనసాగిస్తే... రోహిత్, ఈశ్వరన్​లలో ఒకరికి మిడిలార్డర్​లో అవకాశమొస్తుంది. స్పెషలిస్టు వికెట్ కీపర్​గా వృద్ధిమాన్ సాహా, రిషభ్ పంత్​లలో ఒకరిని ఎంపిక చేయొచ్చు. అయితే మొదటి ప్రాధాన్యంగా పంత్​నే ఎంచుకునే ఆలోచనలో ఉంది సెలక్షన్ కమిటీ. భువీ ఫిట్​నెస్ సాధించకపోయినట్లయితే.. హార్దిక్ పాండ్య టెస్టు జట్టులోకి పునరాగమనం చేసే అవకాశముంది.

MATCH
రోహిత్ శర్మ

రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ లాంటి పేసర్లు రేసులో ఉన్నారు. షమికి విశ్రాంతినిస్తే ఉమేశ్ యాదవ్​ జట్టులోకి వచ్చే అవకాశముంది. నవదీప్ సైని బ్యాకప్ పేసర్​గా ఉండనున్నాడు.

జట్టు అంచనా

ఓపెనర్లు: మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ

మిడిలార్డర్: పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, హనుమ విహారి

ఆల్ రౌండర్లు: హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా

వికెట్ కీపర్లు: రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహా

పేసర్లు: జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి/ ఉమేశ్ యాదవ్

స్పిన్నర్లు: రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్.

ఇదీ చదవండి: దక్షిణాఫ్రికా సిరీస్​లో నా బెస్ట్ ఇస్తా: పంత్

RESTRICTION SUMMARY: MUST CREDIT 'NYSE'
SHOTLIST:
NYSE - MUST CREDIT 'NYSE'
New York - 11 September 2019
1. Mid of FDNY (New York City Fire Department) and NYPD (New York City Police Department) officials signaling moment of silence with single strike of the NYSE bell
2. Zoom out of screens showing FDNY and NYPD seals to traders on the floor during moment of silence
3. Zoom out and pan left of traders on the floor
4. Mid of FDNY and NYPD signaling conclusion of moment of silence
5. Various of traders on the floor
6. Wide pan of large flag draped outside building
7. Various pans of trading floor
8. Members of the FDNY and NYPD ringing the opening bell
9. Zoom out of traders on the floor
STORYLINE:
The New York Stock Exchange, with the help from members of the New York Fire Department and New York Police Department, held a moment of silence Wednesday to commemorate the 18th anniversary of the September 11 attacks.
The moment of silence was held ahead of the opening bell, which members of the FDNY and NYPD, later rang.
Eighteen years after the deadliest terror attack on American soil, the nation is still grappling with the aftermath at ground zero, in Congress and beyond.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.