పరిమిత ఓవర్ల ఫార్మాట్ రాణిస్తున్నప్పటికీ టెస్టులో తన తొలి ప్రాధాన్యమని టీమ్ఇండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్పష్టం చేశాడు. ఇందులో భాగంగా ఐపీఎల్లో బౌలింగ్‌ను మేనేజ్ చేసుకుంటానని అన్నాడు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు.
"టెస్టుల్లో ఆడాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకునే నా పనిని, ఐపీఎల్ ప్రాక్టీసు చేస్తున్నాను. కెరీర్ ఇంకా చాలా టెస్టులు ఆడాల్సి ఉంది. బౌలింగ్ వేరియేషన్స్, నకుల్ బంతి విషయాల్లో చాలా మెరుగుపడాలి" అని భువనేశ్వర్ చెప్పుకొచ్చాడు.
తనతో పాటు జట్టులో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్న శార్దుల్ ఠాకుర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణను ప్రశంసించాడు భువీ.
ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచింది. భువనేశ్వర్ 42 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో ధావన్, హార్దిక్, పంత్ అర్ధశతకాలతో రాణించారు.