క్రికెట్లో ఎన్ని మార్పులొచ్చినా టెస్టు క్రికెట్‌కు ఉన్న ప్రత్యేకతే వేరు. 3 గంటల్లో ముగిసే టీ-20 కన్నా 5 రోజులు జరిగే టెస్టు క్రికెట్లో ఉన్న మజానే వేరని చాలా మంది క్రికెటర్లూ అభిప్రాయపడతారు. తాజాగా టెస్టు మ్యాచ్‌లపై ఐసీసీ సీఈఓ డేవిడ్ రిచర్డ్సన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
"టెస్టు క్రికెట్‌కు ప్రాముఖ్యం తగ్గిపోవడం లేదు. దానిపై క్రికెట్ అభిమానులకు ఆసక్తి కలిగేలా కొత్త పద్ధతులను అవలంబించాలి. త్వరలో పరిచయం చేయబోయే టెస్టు ఛాంపియన్‌షిప్‌తో దానికి సహకారం అందుతుంది." - డేవిడ్ రిచర్డ్సన్, ఐసీసీ సీఈఓ
"మేము టెస్టు ఛాంపియన్‌షిప్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంపొందించాలి అనుకుంటున్నాం. ఎందుకంటే టెస్టు క్రికెట్ అంతరించిపోయే పరిస్థితి రాకూడదు." - శశాంక్ మనోహర్, ఐసీసీ ఛైర్మన్
చాలా దేశాల్లో ఇప్పటికీ టెస్టులను ఆదరిస్తున్నారు. 3 ఫార్మాట్లను అనుసరిస్తున్న కిక్రెట్ అభిమానులు 68 శాతం మంది ఉన్నారని రిచర్డ్సన్ వెల్లడించారు. కనుక వాటికి ఆదరణ తగ్గట్లేదని డేవిడ్ తెలిపారు.