టీమ్ఇండియా వైస్‌కెప్టెన్ రోహిత్‌శర్మకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు క్రికెటర్ రాబిన్ ఉతప్ప. కరోనా లాక్డౌన్ కారణంగా క్రికెటర్లంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లను 'వన్ ఆన్ వన్ #వర్క్‌ఫ్రమ్‌హోమ్' కార్యక్రమం ద్వారా వీడియో కాల్లో ఇంటర్వ్యూ చేస్తోంది ఓ క్రీడాసంస్థ. ఈ షోలో మొదటి గెస్ట్‌గా రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప పాల్గొన్నాడు. ఐపీఎల్‌లో తాను ఆడిన ఉత్తమ కెప్టెన్ గురించి చెప్పమని అడిగినప్పుడు గౌతమ్ గంభీర్ పేరు చెప్పాడు.
"గంభీర్ చాలా సార్లు నా వెన్నంటే ఉన్నాడు. అతడు పెద్దగా మాట్లాడడు. అవసరమైనంత వరకే మాట్లాడతాడు. మంచి నాయకులు మనం సురక్షితంగా ఉండేలా జాగ్రత్త వహిస్తారు. అంతేకాకుండా వారు కెప్టెన్‌గా మంచి విజయాల్ని సాధిస్తారు. టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్శర్మలోనూ ఇలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అతడు ఆటగాళ్లతో నడుచుకునే తీరు అందుకు నిదర్శనం."
--రాబిన్ ఉతప్ప, టీమ్ఇండియా ఆటగాడు
![Teamindia vice Captain Rohit Sharma interacts with players, you can tell he's a leader: Robin Uthappa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6711433_2.jpg)
ఈ వీడియో ద్వారా తన వ్యక్తిగత జీవితాన్ని పరిచయం చేశాడు ఉతప్ప. లాక్డౌన్ కారణంగా కుటుంబసభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతున్నానని తెలిపాడు.
ఇదీ చూడండి.. రోహిత్ శర్మ క్రికెట్ క్రిష్ ఎవరో తెలుసా?