మహిళల టీ20 ప్రపంచకప్ ముగిసింది. భారత్‌తో జరిగిన తుదిపోరులో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. హర్మన్‌సేన సమష్టిగా వైఫల్యం చెంది అభిమానుల్ని నిరాశపర్చింది. ఈ ఓటమిపై స్పందించిన టీమిండియా స్టార్ బ్యాట్స్ఉమెన్ స్మృతి మంధాన.. గెలుపు కంటే ఓటమి చాలా నేర్పిస్తుందని తెలిపింది.
"ఈ ఓటమిపై లోతుగా ఆలోచించాల్సిన సమయం ఇది. గెలుపు కంటే ఓటమి చాలా నేర్పిస్తుంది. భవిష్యత్‌లో ఎలా రాణించాలి అన్న విషయంలో ప్రస్తుతం జట్టును ఒంటరిగా వదిలిపెట్టండి. టీ20 గొప్ప ఫార్మాటేమీ కాదు. నాకు తెలిసి వన్డే ఫార్మాట్ చాలా గొప్పది. మేము అన్ని ఫార్మాట్లను సమానంగా ఆడుతున్నాం."
-స్మృతి మంధాన, క్రికెటర్
ఈ టోర్నీలో నిరాశ పర్చింది స్మృతి మంధాన. మరో ఓపనర్ షెఫాలీ వర్మ మాత్రం గొప్పగా రాణించింది. దీనిపై స్పందించింది స్మృతి.
"యంగ్‌స్టార్స్ వచ్చినప్పటి నుంచి జట్టు మరింత మెరుగైంది. ఈ టోర్నమెంట్లో జట్టుగా మంచి ప్రదర్శన చేశాం. షెఫాలీ వర్మ అద్భుతంగా ఆడింది. మెడల్స్ తీసుకుంటున్న సమయంలో తను కన్నీళ్లు పెట్టుకుంది. నేను 16 ఏళ్ల వయసులో మొదటి ప్రపంచకప్ ఆడినపుడు షెఫాలీ ఆటలో 20 శాతం కూడా ప్రదర్శన చేయలేదు. తను ఆడిన విధానం పట్ల షెఫాలీ గర్వపడాలి."
-స్మృతి మంధాన, క్రికెటర్
ఈ మ్యాచ్‌లో మంధాన 11 పరుగులు మాత్రమే చేసింది. షెఫాలీ 2 రన్స్ చేసి పెవిలియన్ చేరింది. ఇద్దరు ఓపెనర్లతో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ (4), జెమ్మీ రోడ్రిగ్స్ (0) విఫలమయ్యారు. ఫలితంగా 99 పరుగులకే ఆలౌటైంది భారత్. 85 పరుగుల తేడాతో ఆసీస్ ఘనవిజయం సాధించింది.