మైదానంలో యువకీపర్ పంత్‌ను ఎగతాళి చేస్తూ... గత మ్యాచ్‌ల్లో ధోనీ పేరు పలకడంపై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మహీ పేరు అరుస్తూ యువ ఆటగాడిని అపహాస్యం చేయొద్దని అభిమానులను కోరాడు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం... వెస్టిండీస్‌తో తొలి టీ20 ఆడనుంది టీమిండియా. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు కోహ్లీ.
" యువ ఆటగాడి(పంత్)కి కొంత స్పేస్ ఇవ్వాల్సిన బాధ్యత చుట్టుపక్కల ఉన్న వారందరిపై ఉంది. అభిమానులు దయచేసి ధోనీ పేరు పలుకుతూ పంత్‌ను అపహాస్యం చేయొద్దు. ఏ క్రికెటర్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాలని అనుకోడు. దేశం కోసం ఆడుతున్నప్పుడు ఆటగాడి తప్పులు ఎంచడం మానేసి... అతడికి కావాల్సిన మద్దతు ఇవ్వాలి" --కోహ్లీ, టీమిండియా సారథి
ప్రపంచప్ తర్వాత విండీస్ గడ్డపై జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌కు.. ధోనీ స్థానంలో రిషబ్ పంత్ ఎంపికయ్యాడు. అప్పట్నుంచి జరిగిన ఏ సిరీస్‌లోనూ బ్యాటింగ్, కీపింగ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. క్యాచ్‌లు వదిలేయడం, డీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం కావడంపై అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. వాటి గురించే కోహ్లీ మాట్లాడాడు. ఇప్పటికి వరకు 23 టీ20లు ఆడిన పంత్... 19.88 సగటుతో మాత్రమే 358 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేటు 118.15 ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
టీమిండియా.. ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉందన్న కోహ్లీ.. టీ20ల్లో ర్యాంకింగ్స్‌ను పట్టించుకోవడం లేదన్నాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో ఈ ఫార్మాట్‌లో ప్రయోగాలను కొనసాగిస్తామన్నాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. జట్టుకు ప్రధాన బలమని అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జడేజా కీలక ఆటగాడని కితాబిచ్చాడు.
భారత్ పర్యటనలో భాగంగా వెస్టిండీస్.. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ శుక్రవారం తొలి మ్యాచ్.. ఈనెల 22న కటక్ వేదికగా చివరి మ్యాచ్ జరగనుంది.