ETV Bharat / sports

ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​లో అగ్రస్థానానికి భారత్​ - టెస్టు ఛాంపియన్​ షిప్​ పాయింట్ల పట్టికలో టీమ్​ఇండియా

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీని నెగ్గిన టీమ్​ఇండియా ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​లో టాప్​కు దూసుకెళ్లింది. న్యూజిలాండ్​ రెండో స్థానానికి పడిపోయింది. టెస్టు ర్యాంకింగ్స్​లో భారత్​ రెండో స్థానానికి చేరింది. కివీస్​ తొలిస్థానంలో ఉంది.

icc
ఐసీసీ
author img

By

Published : Jan 19, 2021, 2:04 PM IST

బ్రిస్బేన్‌లో చారిత్రక విజయంతో టెస్టు ఛాంపియన్​షిప్​లో భారత్‌ అగ్రస్థానానికి చేరింది. 71.7 విజయ శాతం, 430 పాయింట్లతో న్యూజిలాండ్‌ను వెనక్కినెట్టి తొలిస్థానంలో నిలిచింది. 5 సిరీసుల్లో 13 టెస్టులాడిన భారత్.. 9 విజయాలు సాధించింది. 5 సిరీస్‌లు ఆడిన కివీస్.. 7 విజయాలతో 420 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. అయితే.. ఈ మూడింటి మధ్య విజయాల శాతంలో స్వల్ప తేడా మాత్రమే ఉంది.

టెస్టు జట్టు ర్యాంకింగ్స్​లో రెండుకు..​

ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్​ కూడా ప్రకటించింది. న్యూజిలాండ్ 118.44 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. టెస్టు సిరీస్​ విజయంతో ఆసీస్​ను వెనక్కి నెట్టిన టీమ్​ఇండియా(117.65) రెండో స్థానానికి చేరుకుంది.

ఇదీ చూడండి : ఆసీస్​పై టీమ్​ఇండియా చారిత్రక విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.