ETV Bharat / sports

'శుభ్​మన్​ గిల్ బ్యాటింగ్‌లో లోపం అదే' - వీరేంద్ర సెహ్వాగ్‌

భారత యువ ఓపెనర్​ గిల్​లో ఓ లోపముందని, దానిని సరిచేసుకుంటే భారీ స్కోర్లు సాధించే అవకాశముందని చెప్పాడు విండీస్​ మాజీ ఆటగాడు బిషప్​​. తన లోపంపై గిల్​కు అవగాహన ఉన్నట్టు అభిప్రాయపడ్డాడు.

Team India opener Shubhman Gill has a technical flaw in his batting, said Ian Bishan
'గిల్ బ్యాటింగ్‌లో లోపం అదే'
author img

By

Published : Jan 26, 2021, 9:27 PM IST

Updated : Jan 27, 2021, 10:07 AM IST

టీమ్ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ బ్యాటింగ్‌లో ఒక సాంకేతిక లోపం ఉందని వెస్టిండీస్‌ మాజీ ఆటగాడు ఇయాన్‌ బిషప్​‌ అన్నాడు. అతడు లెగ్‌సైడ్‌ ఎక్కువగా ఆడుతున్నాడని పేర్కొన్నాడు. గిల్‌ను మాజీ డాషింగ్​ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చాడు. అయితే తన లోపంపై గిల్‌ అవగాహనతో ఉన్నట్టు కనిపించిందని వెల్లడించాడు.

'గిల్‌ బ్యాటింగ్‌లో చిన్న సాంకేతిక లోపంపై నేను ఆందోళన చెందుతున్నా. అతడు తరచూ లెగ్‌స్టంప్‌ నుంచి ఆడుతున్నాడు. లెగ్‌సైడ్‌ మీదుగా బంతిని ఆడుతున్నాడు. ఇలాంటప్పుడు బౌలర్లు స్టంప్‌ మీదుగా బంతులు విసురుతూ సవాల్‌ విసురుతారు. దాంతో బంతి బ్యాటు అంచుకు తగిలి ఔటయ్యే ప్రమాదం ఉంటుంది. గతంలో వీరేంద్ర సెహ్వాగ్‌ ఇలాగే చేస్తుండేవాడు. అయితే గిల్‌ అతనిలా మరీ పట్టనట్టు ఆడడు! బ్రిస్బేన్‌లో గిల్‌ చాలాసార్లు స్టంప్స్‌ పక్కకు వచ్చాడు. కానీ చేతులు, బ్యాటును దేహానికి దూరంగా ఉంచలేదు. నిజానికి అక్కడే నియంత్రణ తప్పుతారు' అని బిషప్‌ అన్నాడు.

'అంటే, గిల్‌కు తన లోపంపై అవగాహన ఉందనే అనిపించింది. అందుకు తగ్గట్టే అతడు సన్నద్ధమయ్యాడు. నిజంగానే అతడు లోపాన్ని సరిదిద్దుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారీ స్కోర్లు సాధించగలడు' అని బిషప్​‌ ధీమా వ్యక్తం చేశాడు. 'ఆస్ట్రేలియాలో పిచ్‌లు కాస్త బౌన్సీగా ఉంటాయి. అక్కడతను ఫ్రంట్‌పుట్‌, బ్యాక్‌ఫుట్‌తో షాట్లు ఆడాడు. షార్ట్‌పిచ్‌ బంతులను బాగా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఉపఖండం ఆటగాళ్లు కొత్త తరం బ్యాట్స్‌మెన్‌ను తలపిస్తున్నారు' అని చెప్పాడు.

ఇదీ చూడండి: బౌన్సర్లంటే చాలా భయం.. కానీ: గిల్​

Last Updated : Jan 27, 2021, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.