ETV Bharat / sports

వైరల్​ మీమ్​​పై కోచ్​ రవిశాస్త్రి ఫన్నీ రిప్లే!

ఇంగ్లాండ్​తో ఇటీవలే జరిగిన మూడో టెస్టులో టీమ్​ఇండియా రెండు రోజుల్లోనే ఘనవిజయం సాధించిన నేపథ్యంలో.. ప్రధానకోచ్​ రవిశాస్త్రిపై నెట్టింట ఓ మీమ్​ వైరల్​గా మారింది. దాన్ని ట్విట్టర్​లో పోస్ట్​ చేసిన ఓ ప్రముఖ రచయిత్రి షేర్​ చేయగా.. దానిపై ఆయన ఫన్నీగా బదులిచ్చారు.

Team India coach Ravi Shastri on viral social media meme
వైరల్​ మీమ్​​పై కోచ్​ రవిశాస్త్రి ఫన్నీ రిప్లే!
author img

By

Published : Feb 28, 2021, 7:30 AM IST

టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రిపై నెటింట్లో మీమ్స్‌ రావడం కొత్తేమి కాదు. గెలిస్తే సంబరాలు చేసుకోవాలని ఆయన ఫొటోలతో ఫన్నీగా పోస్ట్‌లు చేస్తుంటారు. అయితే ఇంగ్లాండ్‌పై భారత్‌ రెండు రోజుల్లోనే ఘన విజయం సాధించిన సందర్భంగా ఓ మీమ్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. 'నేను అయిదు రోజులు డ్రైగా ఉండాలంటే కష్టమని అనుకుంటున్నారా' అని రవిశాస్త్రి పేర్కొన్నాడంటూ ఆ పోస్ట్‌లో ఉంది.

అయితే, ఆ పోస్ట్‌ను రచయిత శోభ ట్వీట్ చేస్తూ రవిశాస్త్రిని ట్యాగ్‌ చేసింది. అయితే దీనికి రవిశాస్త్రి సరదాగా బదులిచ్చారు. "ఈ సరదాను ఎంతో ప్రేమిస్తున్నాను. ప్రస్తుత కఠిన సమయాల్లో చిరునవ్వును తెప్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది" అని రీట్వీట్ చేశారు.

మొతేరా వేదికగా జరిగిన డే/నైట్ టెస్టు రెండు రోజుల్లోనే ఫలితం వచ్చింది. టీమిండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకు ఆలౌటైంది.

ఇదీ చూడండి: కోచ్​ రవిశాస్త్రికి 120 ఏళ్లు.. నెటిజన్ల షాక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.