ETV Bharat / sports

'గృహహింసపై మౌనం వీడి ఫిర్యాదు చేయండి' - గృహహింసకు 50 హెల్ప్​లైన్లు

లాక్​డౌన్​లో గృహహింసను ఎదుర్కొంటోన్న మహిళలకు టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు మద్దతుగా నిలిచారు. బాధితులు వారి మౌనాన్ని వీడి 100కు ఫిర్యాదు చేయాలని ఈ వీడియో ద్వారా కోరారు.

Team India Captain Virat Kohli Share Important Message On Domestic Violence Amid Lockdown
గృహహింసపై మౌనం వీడి ఫిర్యాదు చేయండి
author img

By

Published : Apr 20, 2020, 2:14 PM IST

Updated : Apr 20, 2020, 2:22 PM IST

కరోనా లాక్​డౌన్​లో గృహహింసపై స్పందిస్తూ.. టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్ ​కోహ్లీ ఓ ముఖ్యమైన వీడియోను ఇన్​స్టాలో పోస్ట్​​ చేశాడు. అతని భార్య అనుష్క శర్మతో పాటు క్రికెటర్​ రోహిత్​ శర్మ, భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్​ మిథాలీ రాజ్​, పలువురు బాలీవుడ్​ ప్రముఖులు అందులో కనిపించి సందేశాన్ని అందించారు.

"గృహహింసలో మీరు బాధితురాలిగా, సాక్షిగా లేదా గృహహింస నుంచి బయటపడిన వారైతే దయచేసి పోలీసులకు తెలియజేయండి" అని కోహ్లీ పోస్ట్​ చేశాడు. ఈ వీడియోను అనుష్క శర్మ షేర్​ చేసింది. ఈ వీడియోలో బాలీవుడ్ తారలు ఫర్హాన్ అక్తర్, కరణ్ జోహర్, మాధురీ దీక్షిత్ తదితరులు ఉన్నారు. లాక్​డౌన్​ సమయంలో గృహహింస గణనీయంగా పెరిగిందని వారందరూ చెబుతున్నారు. ఆ బాధితులకు అండగా నిలబడటం సహా ఇలాంటి చర్యలను రూపుమాపాలని స్త్రీలను కోరారు.

లాక్​డౌన్​లో పెరిగిన ఫిర్యాదులు

మార్చి 22 నుంచి ఏప్రిల్ 16 వరకు 239, ఫిబ్రవరి 27 నుంచి మార్చి 22 వరకు 123 గృహహింస ఫిర్యాదులు అందినట్లు జాతీయ మహిళా కమిషన్​ పేర్కొంది. ప్రధాని మోదీ మార్చి 24 నుంచి లాక్​డౌన్​ ప్రకటించిన క్రమంలో ఈ కేసులు మరింత పెరిగాయని వారు తెలిపారు.

హెల్ప్​లైన్లు ఏర్పాటు

గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలకు సహాయపడటానికి దేశవ్యాప్తంగా 50కి పైగా హెల్ప్​లైన్లు ప్రారంభించామని హోం మంత్రిత్వశాఖ అధికారి తెలిపారు. వీటిలో కొన్ని హెల్ప్​లైన్లు జాతీయంగా, మరికొన్ని రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పని చేస్తాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి.. 'చైనీస్​ సూపర్​లీగ్​ను త్వరలోనే నిర్వహిస్తాం'

Last Updated : Apr 20, 2020, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.