2020 ఏడాదికిగానూ అత్యంత విలువైన ప్రముఖుల జాబితాలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. వరుసగా నాలుగోసారి చోటు దక్కించుకున్నాడు. రూ.1733 కోట్ల బ్రాండ్ విలువతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ తర్వాత రెండు, మూడు స్థానాల్లో బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ ఉన్నారు.
ప్రముఖుల బ్రాండ్ వ్యాల్యూయేషన్ ఆరవ ఎడిషన్ ప్రకారం.. రూ. 866 కోట్ల బ్రాండ్ విలువతో (గతేడాదితో పోలిస్తే 13.8 శాతం వృద్ధి) బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. మూడో స్థానంలో రణ్వీర్ సింగ్ రూ.750 కోట్ల బ్రాండ్ విలువను సొంతం చేసుకున్నాడు.
ప్రముఖుల బ్రాండ్ వాల్యూను అంచనా వేసే డఫ్ అండ్ ఫెల్ప్స్ సంస్థ గురువారం ఈ వివరాలను ప్రకటించింది. కరోనా సంక్షోభంలోనూ కోహ్లీ బ్రాండ్ విలువ అదే విధంగా ఉన్నా.. గతేడాదితో పోలిస్తే ఈ జాబితాలోని టాప్-20 సెలబ్రిటీలు వారి విలువలో 5 శాతాన్ని కోల్పోయారని ఈ నివేదిక వెల్లడించింది.
ఈ జాబితాలోని టాప్-10 స్థానాల్లో 9 మంది సినీప్రముఖులు ఉండగా.. ఒక్క స్థానంలో క్రికెటర్ కోహ్లీ ఉండటం విశేషం. ఆ తొమ్మిది మంది సినీ సెలబ్రిటీల్లో ఇద్దరు నటీమణులు ఉన్నారు.
ఆ తర్వాత నాలుగో స్థానంలో బాలీవుడ్ బాద్షా.. రూ.372.5 కోట్ల బ్రాండ్ వాల్యూతో ఉన్నాడు.
ర్యాంకింగ్ | సెలబ్రిటీ | బ్రాండ్ వాల్యూ |
1) | విరాట్ కోహ్లీ | రూ. 1733 కోట్లు |
2) | అక్షయ్ కుమార్ | రూ. 866 కోట్లు |
3) | రణ్వీర్ సింగ్ | రూ. 750 కోట్లు |
4) | షారుక్ ఖాన్ | రూ. 372.5 కోట్లు |
5) | దీపికా పదుకొణె | రూ. 367.5 కోట్లు (2019లో మూడోస్థానం) |
6) | అలియా భట్ | రూ. 350 కోట్లు (2019లో ఏడోస్థానం) |
ఆయుష్మాన్ ఖురానా | రూ. 350 కోట్లు (2019లో జాబితాతో పోలిస్తే నాలుగు స్థానాలు మెరుగయ్యారు) | |
8) | సల్మాన్ ఖాన్ | రూ. 328 కోట్లు |
9) | అమితాబ్ బచ్చన్ | రూ. 322.3 కోట్లు |
10) | హృతిక్ రోషన్ | రూ. 287.3 కోట్లు |
ఇదీ చూడండి: భారత్‌తో తొలి రెండు టెస్టులకు క్రావ్లీ దూరం