టీమిండియా క్రికెటర్లు.. సోషల్ మీడియాలో సహచరులపై అప్పుడప్పుడూ సరదాగా ట్వీట్లు, కామెంట్లు చేస్తుంటారు. తాజాగా భారత ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌పై ఓపెనర్ రోహిత్‌శర్మ.. ఇదే రీతిలో కామెంట్ చేశాడు.
ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో సరైన ప్రదర్శన చేయలేకపోయాడు జాదవ్. అప్పట్నుంచి ఏ సిరీస్‌లోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. ఇటీవలే ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ నిరాశపర్చాడు.
తాజాగా తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలు పెట్టాడు జాదవ్. వాటిపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "ఫోజులు కొట్టడం ఆపి బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు" అని కామెంట్ చేశాడు. జాదవ్ పోస్ట్‌కు హిట్‌మ్యాన్ సమాధానం ఇవ్వడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఈ పోస్ట్.. ఇన్‌స్టాలో గురువారం మోస్ట్ పాపులర్‌గా నిలిచింది.
- View this post on Instagram
Feels good to be back on the field and do what I like to do. 🏏🙂 #ranjitrophy @sareen_sports
">
వెస్టిండీస్‌తో త్వరలో ఆరంభం కానున్న వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు కేదార్ జాదవ్. ఈనెల 15న చెన్నైలో మొదటి మ్యాచ్. 18న రెండోది విశాఖపట్నంలో, మూడో మ్యాచ్ 22న కటక్‌లో జరగనున్నాయి.
ఐదేళ్లయినా నిలబెట్టుకోలే
2014లోనే టీమిండియాలో చోటు దక్కించుకున్న ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్... జాతీయ జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్ సహా దేశవాళీ టోర్నీల్లోనూ పెద్దగా రాణించలేదు. వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు రెండు సెంచరీలు, 6 అర్థ శతకాలు చేశాడు. 9 టీ20ల్లో 20.33 సగటుతో 122 పరుగులే సాధించాడు.
విండీస్‌తో సిరీస్‌కు వన్డే జట్టు..
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్.