ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్‌ను నిర్వహించడం దాదాపు అసాధ్యమని క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మన్ ఎర్ల్ ఎడ్డింగ్స్ అభిప్రాయపడ్డారు. అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు ఆస్ట్రేలియాలో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే, వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు సరిహద్దులను మూసేయడం వల్ల.. టోర్నీ జరిగే అవకాశాలపై సందిగ్ధత నెలకొన్నట్లు ఎడ్డింగ్స్ తెలిపారు.
"ఈ ఏడాది టోర్నీని ఇంకా అధికారికంగా రద్దు కానీ, వాయిదా కానీ వేయలేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గని సమయంలో 16 దేశాలకు చెందిన జట్లు ఆస్ట్రేలియాకు రావడం అసాధ్యమైన పని. ఇప్పటికే ఐసీసీ ముందు దీనికి సంబంధించి అనేక ప్రతిపాదనలు ఉంచాం. పరిస్థితులను బట్టి ఓ నిర్ణయానికి వస్తాం.
-ఎర్ల్ ఎడ్డింగ్స్, క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మన్
క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నిక్ హోక్లే మాట్లాడుతూ.. వచ్చే నెలలో టోర్నమెంట్ నిర్వహణపై ఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: