నవంబర్‌లో జరగబోయే ఆస్ట్రేలియా-భారత్ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు.. సిడ్నీ, కాన్బెర్రా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మైదానాల్లోనే మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనున్నాయి ఇరుజట్లు.
ఆసీస్ పర్యటనలో భాగంగా టీమ్ఇండియా తొలుత సిడ్నీకి చేరుకోనుంది. అక్కడే పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్ పూర్తి చేసుకొని ప్రాక్టీస్‌లో పాల్గొంటుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా అక్కడే నిర్బంధంలో ఉండనున్నారు.
అనంతరం వీరంతా సిరీస్‌లో పాల్గొంటారు. ఈ విషయాన్ని న్యూ సౌత్ వేల్స్ క్రీడా శాఖ మంత్రి స్టువర్ట్ యైర్స్ తెలిపారు. దీనిపై తాము, క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు చర్చించుకున్నామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి ద్రౌపదిగా సౌందర్య.. 'నర్తనశాల' లుక్ విడుదల