లాక్డౌన్ కారణంగా ఐపీఎల్‌ను వాయిదా వేసినా.. సోషల్‌మీడియా ద్వారా అభిమానులను అలరిస్తోంది చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్యం. ఆ జట్టులోని ఆటగాళ్లను ఫేస్ యాప్ ద్వారా అమ్మాయిలుగా మార్చిన ఫొటోను బుధవారం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఈ ఫొటోపై టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ సురేష్ రైనాతో పాటు శార్దూల్ సోదరి కామెంట్లు చేశారు.
![Suresh Raina Wants Coffee Date With Shardul Thakur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7765610_1.jpg)
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోపై రైనా స్పందిస్తూ.."హా..హా...హా...నేనూ, శార్దూల్ ఠాకూర్ త్వరలోనే కాఫీకి వెళ్తాం" అని కామెంట్ చేశాడు. శార్దూల్ సోదరి మాలతి చాహర్ కామెంట్ చేస్తూ.."అమాయకమైన ముఖంతో.. ఎర్రని లిప్‌స్టిక్ వేసుకున్నాడు శార్దూల్ ఠాకూర్. కొంటె కళ్లు, పెద్ద పెదవుల కాంబినేషన్ చాలా బాగుంటుంది" అని వెల్లడించింది.
![Suresh Raina Wants Coffee Date With Shardul Thakur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7765610_2.jpg)
ఇటీవలే రోహిత్ శర్మను యువతిలా మార్చిన ఫొటోను షేర్ చేశాడు టీమ్ఇండియా స్పిన్నర్ చాహల్. రోహిత్ అమ్మాయిగా పుడితే ఎలా ఉంటుందనే ఆసక్తిని రేకెత్తించాడు. ట్విట్టర్లో అతడి ఫొటోను పంచుకున్న చాహల్.. పక్కనే అతడి మహిళా రూపాన్ని జతచేశాడు. దానికి "రోహితా శర్మ భయ్యా చాలా అందంగా ఉన్నావ్" అంటూ నవ్వుతున్న ఎమోజీలు జోడించాడు.