కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 58 పరుగులు చేసిన సురేష్ రైనా మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 58 పరుగులతో ఆకట్టుకున్న రైనా ఓ జట్టుపై ఐపీఎల్లో అత్యధిక పరుగులు (807) చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ముంబయిపై 803 పరుగులు చేసి రెండో స్థానంలోనూ రైనానే ఉండటం విశేషం. కోహ్లీ దిల్లీ జట్టుపై 802 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇవీ చూడండి .. రో'హిట్టింగా'... విరాట్ సేన విజయమా!