ETV Bharat / sports

గ్యాప్ వస్తే ఏంటి.. ఫామ్ తగ్గలే ఇంకా! - సురేశ్ రైనా హాఫ్ సెంచరీ

గత ఐపీఎల్​కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్​మన్ సురేశ్ రైనా. చాలాకాలంగా బ్యాట్​ పట్టకపోవడం వల్ల ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తాడో అన్న అనుమానాలు తలెత్తాయి. కానీ దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు.

raina
రైనా
author img

By

Published : Apr 11, 2021, 7:31 AM IST

గత ఐపీఎల్‌ సీజన్‌ ముంగిట వ్యక్తిగత కారణాలతో రైనా టోర్నీ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. ఏడాదిగా పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్న రైనా.. ఈసారి ఐపీఎల్‌లో ఏమాత్రం రాణిస్తాడో అన్న సందేహాలు కలిగాయి. అతడి ఫిట్‌నెస్‌ మీదా ప్రశ్నలు తలెత్తాయి. కానీ వాటన్నింటికీ శనివారం అతను జవాబు చెప్పాడు. తనదైన శైలిలో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి అభిమానులను అలరించాడు.

దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో క్రీజులో అతను ఏమాత్రం ఇబ్బంది పడలేదు. ఆరంభం నుంచి మంచి లయతో కనిపించాడు. వచ్చీ రాగానే షాట్లు మొదలుపెట్టేశాడు. ముందు డ్రైవ్‌లు ఆడిన రైనా.. తర్వాత లాఫ్టెడ్‌ షాట్లకు వెళ్లాడు. అందరు బౌలర్లనూ అలవోకగా ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా స్పిన్నర్లు అశ్విన్‌, మిశ్రాల బౌలింగ్‌లో భారీ షాట్లతో సునాయాసంగా పరుగులు రాబట్టాడు. పోటీ క్రికెట్‌ ఆడి చాలా కాలం అయినప్పటికీ.. విరామం తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకంతో తన జోరింకా తగ్గలేదని చాటిచెప్పాడు చిన్న తలా.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.