ETV Bharat / sports

పంత్​కు కెప్టెన్సీపై రైనా ట్వీట్.. పాంటింగ్ స్పందన - ఐపీఎల్ 2021

పంత్​కు దిల్లీ జట్టు కెప్టెన్సీ బాధ్యతల్ని అప్పగించడంపై రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రధాన కోచ్ పాంటింగ్​ కూడా పంత్​తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.

Suresh Raina confident Rishabh Pant will make a good captain
పంత్​కు కెప్టెన్సీపై రైనా ట్వీట్.. పాంటింగ్ స్పందన
author img

By

Published : Mar 31, 2021, 12:16 PM IST

దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​గా రిషభ్ పంత్​ ఎంపికవడంపై చెన్నై సూపర్​కింగ్స్ స్టార్ క్రికెటర్​ సురేశ్ రైనా స్పందించాడు. విజయాలతో తమ జట్టుకు అదృష్టాన్ని తీసుకొచ్చే సారథి అతడు అవుతాడని అభిప్రాయపడ్డాడు. కొత్త బాధ్యతలను గౌరవంతో నిర్వర్తిస్తాడని ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నాడు.

delhi capitals rishab pant
దిల్లీ క్యాపిటల్స్- రిషభ్ పంత్

దిల్లీ కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్.. ఇటీవల జరిగిన ఇంగ్లాండ్​తో సిరీస్​లో గాయపడ్డాడు. ఎడమ భుజానికి శస్త్రచికిత్స చేయాల్సి ఉండటం వల్ల ఈ సీజన్​ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే పంత్​ను కొత్త సారథిగా నియమిస్తున్నట్లు మంగళవారం, జట్టు అధికారికంగా ప్రకటించింది.

"గత రెండు సీజన్లలో శ్రేయస్ కెప్టెన్సీలో పంత్ ప్రదర్శన అమోఘం. ఫలితాలే అందుకు నిదర్శనం. ఇప్పుడు సారథిగా పంత్​కు ఇది అద్భుత అవకాశం. ఇటీవల ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియాపై విజయవంతమైన అతడు.. కొత్త బాధ్యతలు తీసుకునేందుకు పూర్తి విశ్వాసంతో ఉన్నాడు" అని దిల్లీ క్యాపిటల్స్​ ప్రధాన కోచ్ పాంటింగ్ చెప్పాడు.

pant pointing
పంత్-పాంటింగ్

దిల్లీ క్యాపిటల్స్​, తన తొలి మ్యాచ్​ను ఏప్రిల్ 10న చెన్నై సూపర్​కింగ్స్​తో తలపడనుంది. దీనికి ముంబయిలోని వాంఖడే మైదానం వేదిక కానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.