ETV Bharat / sports

జడేజా సూపర్​మ్యాన్​ క్యాచ్​పై ఓ లుక్కేయండి - jadeja super catch

టీమిండియా ఆల్​రౌండర్​​ రవీంద్ర జడేజా.. న్యూజిలాండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో బరిలోకి దిగాడు. అశ్విన్​ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న ఇతడు.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్​లో రెండు కీలక వికెట్లు తీయడమే కాకుండా.. రెండు క్యాచ్​లూ అందుకున్నాడు.

Ravindra Jadeja superman catch
రెండో టెస్టు: జడేజా సూపర్​మ్యాన్​ క్యాచ్​ చూశారా?
author img

By

Published : Mar 1, 2020, 10:31 AM IST

Updated : Mar 3, 2020, 1:09 AM IST

క్రైస్ట్​చర్చ్​ వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో జడేజా అద్భుతమైన ఫీల్డింగ్​, బౌలింగ్​ ప్రదర్శన చేశాడు. కివీస్​ తొలి ఇన్నింగ్స్​లో ఆ జట్టు బ్యాట్స్​మెన్​ టేలర్​(15), గ్రాండ్​హోమ్​(26)లను పెవిలియన్​ చేరాడు జడ్డూ. అంతేకాకుండా వాట్లింగ్​(0)తో పాటు వాగ్నర్​(21)ను పెవిలియన్​ చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. వీరిద్దరినీ అద్భుతమైన క్యాచ్​లతో ఔట్​ చేశాడు.

వావ్​ అనిపించిన క్యాచ్​..

అప్పటికి న్యూజిలాండ్​ స్కోరు 177/8. క్రీజులో ఆల్​రౌండర్​ జేమిసన్​ ఉండగా.. బౌలర్​ వాగ్నర్​ అతడికి తోడయ్యాడు. వీరిద్దరూ 9వ వికెట్​కు 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఈ జోడీని జడేజా అద్భుతమైన క్యాచ్​తో విడగొట్టాడు. షమి వేసిన 76వ ఓవర్​ ఆఖరి బంతి.. బౌన్సర్ రాగా వాగ్నర్​ స్క్వేర్​ లెగ్​ దిశగా కొట్టాడు. అయితే గాల్లోకి లేచిన బంతిని సూపర్​ మ్యాన్​లా ఎగిరి ఒంటిచేత్తో అందుకున్నాడు జడ్డూ. ఈ క్యాచ్​ చూశాక వాగ్నర్​ నిర్ఘాంతపోయాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్​గా మారింది. ఆ తర్వాత 7 పరుగుల వ్యవధిలో షమి బౌలింగ్​లోనే పెవిలియన్​ చేరాడు జేమిసన్​. ఫలితంగా తొలి ఇన్నింగ్స్​లో న్యూజిలాండ్​ 235 పరుగులు చేసి ఆలౌట్​ అయింది.

మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా.. 22 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. బౌలర్లందరిలో ఇతడు అత్యుత్తమ ఎకానమీతో బౌలింగ్​ చేయడం విశేషం.

ఇదీ చదవండి...

రెండో టెస్టు: భారత బౌలర్లు భళా.. కివీస్‌ తొలి ఇన్నింగ్స్​​ 235

Last Updated : Mar 3, 2020, 1:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.