స్వదేశంలో టీ20 సిరీస్ గెలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయింది న్యూజిలాండ్ జట్టు. ఇవాళ జరిగిన మూడో టీ20లో పరాజయం చెంది సిరీస్‌ను 0-3తో టీమిండియాకు అప్పగించింది. తొలి రెండు టీ20ల్లో పెద్దగా ఆకట్టుకోని కివీస్.. మూడో టీ20లో మాత్రం గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. ముఖ్యంగా సారథి కేన్ విలియమ్సన్ అద్భుతంగా రాణించినా జట్టును గెలిపించలేకపోయాడు. అయితే తాజా ఓటమిపై స్పందించాడు విలియమ్సన్. సూపర్ ఓవర్‌లు వారికి స్నేహితులు కాదని అభిప్రాయపడ్డాడు.
-
New Zealand score 17/0 👏
— ICC (@ICC) January 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Can India chase it?#NZvIND pic.twitter.com/RqCGlR3YlU
">New Zealand score 17/0 👏
— ICC (@ICC) January 29, 2020
Can India chase it?#NZvIND pic.twitter.com/RqCGlR3YlUNew Zealand score 17/0 👏
— ICC (@ICC) January 29, 2020
Can India chase it?#NZvIND pic.twitter.com/RqCGlR3YlU
"మాకు సూపర్ ఓవర్‌లు కలసి రావడం లేదు. అవి మాకు నిజంగా స్నేహితులు కాదు. అందుకే మేము మామూలు మ్యాచ్‌ల్లోనే గెలవాలి. క్రికెట్ ఎంతో గొప్ప ఆట. ఏ చిన్న తప్పు దొర్లినా విజేత మారిపోతారు. కీలక సమయంలో టీమిండియా తన అనుభవాన్ని ఉపయోగించి విజయం సాధించింది. ఈ విషయంలో మేము భారత్ నుంచి ఎంతో నేర్చుకోవాలి. టీమిండియా ఓపెనర్లు దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించినా మా బౌలర్లు తిరిగి పుంజుకొని అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ రోజు నా బ్యాటింగ్ పట్ల సంతృప్తిగా ఉన్నాను. మిడిల్ ఓవర్లలో భాగస్వామ్యాలు నమోదు చేశాను. కానీ మ్యాచ్‌ను విజయంతో ముగించకపోవడం దురదృష్టకరం. ఓటమి గురించి సభ్యులతో చర్చించుకోవాలి. మేము మరింత మెరుగుపడాలి. ముఖ్యంగా ఒత్తిడిలో జయించడం నేర్చుకోవాలి".
-- కేన్ విలియమ్సన్, న్యూజిలాండ్ కెప్టెన్
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అయితే లక్ష్య ఛేదనలో కివీస్ జట్టు బ్యాట్స్‌మన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. సారథి కేన్ విలియమ్సన్ ఒంటరి పోరాటం చేశాడు. 48 బంతుల్లో 95 పరుగుల (8 ఫోర్లు, 6 సిక్సర్లు)తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే మ్యాచ్ కివీస్ సొంతం అనుకున్న సమయంలో... 20వ ఓవర్‌లో షమి అద్భుతమైన బౌలింగ్‌కు ఔటయ్యాడు కేన్. ఆఖరి మూడు బంతుల్లో 5 పరుగులు చేయలేక మ్యాచ్‌ను 'టై' చేసుకుంది బ్లాక్‌క్యాప్స్ జట్టు. తర్వాత సూపర్ ఓవర్ జరగ్గా అందులో రోహిత్ రెండు సిక్సర్లు, రాహుల్ ఫోర్ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించారు. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 శుక్రవారం జరగనుంది.
-
WHAT A MATCH! 🔥🔥#TeamIndia win in super over, take an unassailable lead of 3️⃣ - 0️⃣ in the 5-match series. 🇮🇳 #TeamIndia #NZvIND pic.twitter.com/4Lc1AdFZZg
— BCCI (@BCCI) January 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">WHAT A MATCH! 🔥🔥#TeamIndia win in super over, take an unassailable lead of 3️⃣ - 0️⃣ in the 5-match series. 🇮🇳 #TeamIndia #NZvIND pic.twitter.com/4Lc1AdFZZg
— BCCI (@BCCI) January 29, 2020WHAT A MATCH! 🔥🔥#TeamIndia win in super over, take an unassailable lead of 3️⃣ - 0️⃣ in the 5-match series. 🇮🇳 #TeamIndia #NZvIND pic.twitter.com/4Lc1AdFZZg
— BCCI (@BCCI) January 29, 2020