కొత్త సంవత్సరంలో జరగబోయే సిడ్నీ టెస్టు కోసం తన జట్టును ప్రకటించాడు మాజీ ఓపెనర్ సునీల్ గావస్కర్. రోహిత్‌తో కలిసి మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేయాలని చెప్పాడు. జనవరి 7న ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.
"మయాంక్ అగార్వల్ జట్టులో కొనసాగుతాడు. ఇప్పటివరకు సంతృప్తికర ప్రదర్శన చేయనప్పటికీ, అతడు నాణ్యమైన ఆటగాడు. రోహిత్‌తో కలిసి అతడు ఓపెనింగ్ చేయాలి. టాప్ఆర్డర్లో శుభ్‌మన్ గిల్ బాగా ఆడుతున్నాడు. అయితే అతడు ఓపెనింగ్‌లో అంతగా సఫలమవుతాడని నేను అనుకోవడం లేదు. 5వ స్థానం అతడికి సరిగ్గా సరిపోతుందని నా అభిప్రాయం. గిల్ వస్తే విహారికి ఉద్వాసన తప్పదు. మిగిలిన జట్టు యథాతథంగా కొనసాగుతుంది."
- సునీల్ గావస్కర్, భారత మాజీ సారథి
తొలి టెస్టు ఘోర పరాభవం తర్వాత బాక్సింగ్‌డే టెస్టు విజయంతో తిరిగి పుంజుకుంది టీమ్ఇండియా. రెండో టెస్టు జట్టుతోనే కొనసాగాలని కెప్టెన్ రహానె సహ యాజమాన్యం భావించింది. అయితే డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడం, పేసర్ ఉమేశ్ యాదవ్ గాయం కారణంగా వైదొలగడం, సెలక్షన్ ప్రక్రియను క్లిష్టంగా మార్చింది.
ఇదీ చూడండి: భారత హాకీ దిగ్గజం మైఖేల్ కిండో కన్నుమూత