ఇంగ్లాండ్ పర్యటన కోసం జట్టుకు స్పాన్సర్లను వెతకడంలో విఫలమైంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. దీంతో ఈ సిరీస్‌లో మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీకి చెందిన ఫౌండేషన్ లోగోను పాక్ ఆటగాళ్ల కిట్లపై ప్రదర్శించాలని పీసీబీ నిర్ణయించింది. దీనిపై ట్విట్టర్లో ఆనందాన్ని వ్యక్తం చేశాడు అఫ్రిది.
-
We’re delighted that the @SAFoundationN logo will be featured on the Pakistan playing kits, since we are charity partners to @TheRealPCB. Thanking #WasimKhan & the PCB for their continued support & wishing our boys all the very best with the tour #HopeNotOut https://t.co/v8fvodh0iN
— Shahid Afridi (@SAfridiOfficial) July 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">We’re delighted that the @SAFoundationN logo will be featured on the Pakistan playing kits, since we are charity partners to @TheRealPCB. Thanking #WasimKhan & the PCB for their continued support & wishing our boys all the very best with the tour #HopeNotOut https://t.co/v8fvodh0iN
— Shahid Afridi (@SAfridiOfficial) July 8, 2020We’re delighted that the @SAFoundationN logo will be featured on the Pakistan playing kits, since we are charity partners to @TheRealPCB. Thanking #WasimKhan & the PCB for their continued support & wishing our boys all the very best with the tour #HopeNotOut https://t.co/v8fvodh0iN
— Shahid Afridi (@SAfridiOfficial) July 8, 2020
"ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్థాన్ ఆటగాళ్లు వారి కిట్లపై 'షాహిద్ అఫ్రిదీ ఫౌండేషన్' లోగోను ప్రదర్శించాలనుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే పీసీబీకి మా ఛారిటీ భాగస్వామిగా ఉంది. వసీమ్ ఖాన్, పీసీబీ మద్దతుకు ధన్యవాదాలు. ఆల్‌దిబెస్ట్ పాక్ క్రికెట్ టీమ్".
- షాహిద్ అఫ్రిదీ, పాకిస్థాన్ మాజీ కెప్టెన్
కరోనా కారణంగా ఆర్థిక భారాన్ని మోస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్ కోసం స్పాన్సర్‌ను వెతకడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పాక్ జట్టు లోగో స్పాన్సర్షిప్ ఒప్పందంపై సంతకం చేయడానికి ఓ పానీయ సంస్థతో చర్చలు కొనసాగుతున్నాయి. సదరు సంస్థ అంచనాల కంటే చాలా తక్కువ మొత్తానికి అంటే గతంలో చెల్లించిన మొత్తంలో 35 శాతం నుంచి 40 శాతమే టెండర్ వేసినట్లు ఓ పీసీబీ అధికారి వెల్లడించాడు.