ETV Bharat / sports

బంతికి ఉమ్మి రుద్దిన స్టోక్స్​.. హెచ్చరించిన అంపైర్లు - బెన్ స్టోక్స్

ఇంగ్లాండ్​ క్రికెటర్​ బెన్​ స్టోక్స్​ అలవాటులో పొరపాటుగా బంతికి ఉమ్మి రుద్దాడు. భారత్​తో జరుగుతున్న రెండో వన్డేలో సంఘటన జరిగింది. గమనించిన ఫీల్డ్​ అంపైర్లు కెప్టెన్ బట్లర్​తో పాటు స్టోక్స్​ను హెచ్చరించారు.

Stokes uses saliva on ball, gets warning from on-field umpires
బంతికి ఉమ్ము రుద్దిన స్టోక్స్​.. హెచ్చరించిన అంపైర్లు
author img

By

Published : Mar 26, 2021, 3:29 PM IST

ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్ స్టోక్స్​ మరోసారి బంతికి లాలాజలం రుద్ది దొరికిపోయాడు. భారత్​తో రెండో వన్డేలో బంతికి ఉమ్మి రుద్దడాన్ని గమనించిన ఫీల్డ్​ అంపైర్లు నితిన్ మీనన్, వీరేందర్​ శర్మ.. కెప్టెన్ బట్లర్​తో పాటు స్టోక్స్​ను హెచ్చరించారు. రెండో వన్డే నాలుగో ఓవర్​లో ఈ సంఘటన జరిగింది. ఇదే ఓవర్​లో టీమ్​ఇండియా ఓపెర్​ శిఖర్​ ధావన్ క్యాచ్​ ఔట్​గా వెనుదిరిగాడు.

మొత్తంగా ఈ పర్యటనలో స్టోక్స్​ ఇలా బంతికి ఉమ్మి రుద్దడం ఇది రెండో సారి. అహ్మదాబాద్​ వేదికగా జరిగిన గులాబీ టెస్టులోనూ ఇలాగే పొరపాటుగా బంతికి లాలాజలం రుద్దాడు స్టోక్స్​.

కొవిడ్​ దృష్ట్యా ఐసీసీ మార్గదర్శకాలు జారీ చేసింది. బంతికి లాలాజలం రుద్దడాన్ని నిషేధించింది. ప్రత్యామ్నాయంగా చెమటను బంతికి రుద్దవచ్చు అని సూచించింది.

ఇదీ చదవండి: బంతికి ఉమ్ము రుద్దిన స్టోక్స్- శానిటైజ్​ చేసిన అంపైర్లు​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.