ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె అదరగొట్టాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ తడబడుతున్నా తాను మాత్రం దృఢంగా నిలబడి సెంచరీ చేశాడు. దీంతో భారత పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే ఈ శతకం కంటే ఇంగ్లాండ్‌పై లార్డ్స్ చేసిన సెంచరీనే తనకు ఎప్పటికీ ఉత్తమమని అన్నాడు.
"సెంచరీ చేయడం ఎప్పుడూ ప్రత్యేకమే. ఇంగ్లాండ్‌పై లార్డ్స్‌లో చేసిన శతకం నా కెరీర్లో ది బెస్ట్. ఆసీస్‌తో బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజూ మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. కెప్టెన్సీ ఆటగాళ్లకు మద్దతుగా నిలవడానికే. ఇందులో క్రెడిట్ అంతా బౌలర్లదే.. వారు సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేశారు. అయితే ఈ మ్యాచ్ ఇంకా పూర్తి కాలేదు. మేం ఇంకా నాలుగు వికెట్లు తీయాల్సి ఉంది"
- అజింక్య రహానె, టీమ్ఇండియా టెస్టు తాత్కాలిక కెప్టెన్
2014లో ఇంగ్లాండ్ పర్యటనలో లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రహానె 154 బంతుల్లో 103 పరుగులు చేశాడు.
-
A stellar knock from #TeamIndia captain @ajinkyarahane88 comes to an end following an unfortunate run-out, his first in Test cricket. He returns after scoring a valiant 112. 👏🏾
— BCCI (@BCCI) December 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Details - https://t.co/bG5EiYj0Kv pic.twitter.com/hDa5ULj7Le
">A stellar knock from #TeamIndia captain @ajinkyarahane88 comes to an end following an unfortunate run-out, his first in Test cricket. He returns after scoring a valiant 112. 👏🏾
— BCCI (@BCCI) December 28, 2020
Details - https://t.co/bG5EiYj0Kv pic.twitter.com/hDa5ULj7LeA stellar knock from #TeamIndia captain @ajinkyarahane88 comes to an end following an unfortunate run-out, his first in Test cricket. He returns after scoring a valiant 112. 👏🏾
— BCCI (@BCCI) December 28, 2020
Details - https://t.co/bG5EiYj0Kv pic.twitter.com/hDa5ULj7Le
అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీ నాయకత్వంలోని టీమ్ఇండియా జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత పితృత్వ సెలవులపై కోహ్లీ స్వదేశానికి వెళ్లగా, అతడి స్థానంలో రహానె కెప్టెన్సీ చేస్తున్నాడు. బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఫీల్డింగ్ సెట్ చేయడం సహా బౌలర్లలను సరైన సమయంలో ఉపయోగించుకుంటున్నాడని మాజీల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఇదీ చూడండి: ఐసీసీ అవార్డులు: కోహ్లీకి రెండు.. ధోనీకి ఒకటి