ETV Bharat / sports

కోహ్లీనే అత్యుత్తమ వన్డే బ్యాట్స్​మన్​: స్మిత్​ - కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్​మన్​

టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ.. ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాట్స్​మన్​ అని కొనియాడాడు ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్​ స్మిత్​. అలాగే కేఎల్​ రాహుల్​, సంజూ శాంసన్, జాస్​ బట్లర్​, డివిలియర్స్ గొప్ప ఆటగాళ్లని కితాబిచ్చాడు.

Kohli
కోహ్లీ
author img

By

Published : Sep 10, 2020, 8:28 PM IST

టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్​ స్మిత్​. విరాట్ ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాట్స్​మన్ అని కీర్తించాడు. ​ ఇన్​స్టాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 11,867 రన్స్​తో అగ్ర స్థానంలో ఉన్నాడు కోహ్లీ. ఇందులో 43 శతకాలు ఉన్నాయి.

ఐపీఎల్​ 13వ సీజన్​లో కేఎల్​ రాహుల్​, సంజూ శాంసన్ ఆటను చూసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపాడు స్మిత్. అలాగే రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జాస్​ బట్లర్​ను 'భయంకరమైన ఆటగాడి'గా.. డివిలియర్స్​ ను 'విధ్వంసకర ఆటగాడి'గా అభివర్ణించాడు.

ప్రస్తుతం ఇంగ్లాండ్​తో జరుగుతోన్న సిరీస్​లో ఆడుతున్నాడు స్మిత్​. ఈ సిరీస్​ సెప్టెంబరు 16న ముగుస్తుంది. అనంతరం సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్​లో పాల్గొంటాడీ ఆసీస్ మాజీ సారథి.

ఇదీ చూడండి చాహల్​- ధనశ్రీ అలా ప్రేమలో పడ్డారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.