ETV Bharat / sports

అలా జరగడం వల్లే మేం ఓడిపోయాం: స్మిత్ - India vs Australia 2nd ODI

మంచి రన్​రేట్​తో లక్ష్యం వైపు సాగుతున్నప్పుడు వికెట్లు కోల్పోవడం వల్లే మ్యాచ్​ ఓడిపోయామని అన్నాడు ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్. మూడో వన్డేలో ఇది పునరావృతం కాకుండా చూస్తామని చెప్పాడు.

అలా జరగడం వల్లే మేం ఓడిపోయం: స్మిత్
సీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్
author img

By

Published : Jan 18, 2020, 5:34 PM IST

Updated : Jan 18, 2020, 11:27 PM IST

ఆస్ట్రేలియాతో సిరీస్​లో తొలి మ్యాచ్​లో ఓడిన టీమిండియా.. రెండో వన్డేలో అద్భుత విజయం సాధించింది. 36 పరుగుల తేడాతో గెలిచింది. సిరీస్​ 1-1తో సమమైంది. మ్యాచ్​ అనంతరం మాట్లాడిన ఆసీస్ స్టార్ స్మిత్.. ఓటమికి అసలు కారణం చెప్పాడు. మ్యాచ్​ రసవత్తరంగా సాగుతుండగా, మిడిల్​ ఓవర్లో వరుసగా వికెట్లు కోల్పోవడమే ఇందుకు కారణమన్నాడు.

"భారీ లక్ష్యం ఛేదించడంలో మిడిల్ ఓవర్లు ఎంతో కీలకం. ఈ సమయంలో ఓ వైపు పరుగులు చేస్తూనే, మరోవైపు వికెట్లను కాపాడుకోవాలి. ఈ మ్యాచ్​లో 30 ఓవర్లపాటు మంచి రన్​రేట్​తో ఆడాం. కానీ 31వ ఓవర్లో లబుషేన్, 38వ ఓవర్లో నేను, క్యారీ వెనుదిరగడం జట్టు ఓటమికి ప్రధాన కారణం. నిర్ణయాత్మక మూడో మ్యాచ్​లో ఎలాంటి పొరపాట్లు చేయకుండా, మ్యాచ్​ను గెలిచి సిరీస్​ను చేజిక్కుంచుకోవాలని అనుకుంటున్నాం" -స్టీవ్ స్మిత్, ఆసీస్ క్రికెటర్

ఈ మ్యాచ్​లో 98 పరుగుల వద్ద కుల్​దీప్ బౌలింగ్​లో వెనుదిరిగాడు స్మిత్. సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. నిర్ణయాత్మక మూడో వన్డే ఆదివారం.. బెంగళూరులో జరగనుంది.

team india
వికెట్ తీసిన ఆనందంలో భారత్ జట్టు

ఇవీ చదవండి:

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Jan 18, 2020, 11:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.