ETV Bharat / sports

గావస్కర్​ సరసన చేరిన స్టీవ్ స్మిత్​ - Steve Smith opposite Sunil Gavaskar

యాషెస్​ సిరీస్​లో ఆడిన​ నాలుగు టెస్టుల్లో మొత్తం 774 పరుగులు సాధించిన స్టీవ్​ స్మిత్​ అరుదైన రికార్డ్​ అందుకున్నాడు. 21వ శతాబ్దంలో ఒక సిరీస్​లో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

స్మిత్
author img

By

Published : Sep 16, 2019, 1:06 PM IST

Updated : Sep 30, 2019, 7:46 PM IST

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన యాషెస్ డ్రాగా ముగిసింది. ఈ సిరీస్​లో అద్భుత ఫామ్​తో సత్తాచాటాడు ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్. 21 శతాబ్దంలో ఒక సిరీస్​లో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలాగే నాలుగు టెస్టుల్లో 774 పరుగులు సాధించి భారత మాజీ క్రికెటర్​ సునీల్ గావస్కర్ సరసన నిలిచాడు.

యాషెస్​లో భాగంగా జరిగిన ఐదు టెస్టు మ్యాచ్​ల సిరీస్​లో స్మిత్​ నాలుగు మ్యాచ్​లు మాత్రమే ఆడాడు. ఆర్చర్ వేసిన బంతి తలకు తగలగా.. మూడో టెస్టుకు దూరమయ్యాడు. మొత్తంగా నాలుగు టెస్టుల్లో 774 పరుగులు సాధించి సునీల్ గావస్కర్ రికార్డును సమం చేశాడు. ఇంతకుముందు 1971లో వెస్టిండీస్​తో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్​ల సిరీస్​లో గావస్కర్​ నాలుగు మ్యాచ్​ల్లో 774 పరుగులు సాధించాడు. ఒక మ్యాచ్​కు దూరంగా ఉన్నాడు. అది గావస్కర్​కు అరంగేట్ర మ్యాచ్​ కావడం విశేషం.

మొదటి స్థానంలో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వి.వి రిచర్డ్స్ కొనసాగుతున్నాడు. 1976లో ఇంగ్లాండ్​తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్​లో నాలుగు మ్యాచ్​ల్లో 829 పరుగులు సాధించాడు రిచర్డ్స్​. అనారోగ్యం కారణంగా ఒక టెస్టుకు దూరంగా ఉన్నాడు.

పరుగులు ఆటగాడు
829 వి.వి రిచర్డ్స్ (1976)
774 సునీల్ గావస్కర్ (1971)
774 స్టీవ్ స్మిత్ (2019)
769 స్టీవ్ స్మిత్ (2014/15)

ఇవీ చూడండి.. ఈ మిలీనియంలో ఒకే ఒక్కడు.. స్టీవ్ స్మిత్!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding the Americas, Sub-Saharan Africa, Middle East & North Africa, Japan, China, New Zealand Belgium, Germany and the Netherlands. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST:
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: IMG Media
DURATION:
STORYLINE:
Last Updated : Sep 30, 2019, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.