ETV Bharat / sports

'కోహ్లీ కంటే స్మిత్ గొప్ప ఆటగాడు' - కోహ్లీ గురించి జాఫర్

టెస్టుల్లో సారథి కోహ్లీ కంటే ఆసీస్ క్రికెటర్ స్మిత్ ఉత్తమమని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్. టాంపరింగ్ వివాదం తర్వాత జట్టులోకి వచ్చి, అద్భుతంగా రాణిస్తున్నాడని తెలిపాడు.

కోహ్లీ
కోహ్లీ
author img

By

Published : Jun 6, 2020, 6:39 PM IST

ప్రస్తుత క్రికెట్​లో టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్​ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. స్మిత్​ కంటే కోహ్లీనే అత్యుత్తమ ఆటగాడిని పలువురు అభిప్రాయపడుతున్నారు. భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ మాత్రం ఇందుకు వ్యతిరేకంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. స్మిత్​ ఉత్తమ క్రికెటర్​ అని అన్నాడు.

"ఈ తరంలో స్మిత్​ అందరి కంటే అత్యుత్తమ టెస్టు క్రికెటర్. అన్ని ఫార్మాట్లలో కోహ్లీ అద్భుత ఆటగాడు. బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన స్మిత్.. టెస్టుల్లో నంబర్ వన్ స్థానాన్ని అతి తక్కువ సమయంలోనే అందుకున్నాడు. ఏడాది తర్వాత కూడా అదే ఫామ్​ చూపిస్తున్నాడు. అందుకే టెస్టుల్లో కోహ్లీ కంటే స్మిత్ గొప్ప ఆటగాడు. పరిమిత ఓవర్ల క్రికెట్​లో విరాట్ తర్వాత రోహిత్ బెస్ట్ క్రికెటర్"

-వసీం జాఫర్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

ఇటీవల ఇదే విషయమై మాట్లాడిన స్మిత్.. కోహ్లీ అద్భుత ఆటగాడని ప్రశంసించాడు. భారత జట్టుకు అతడు ఎంతో సేవ చేశాడని కితాబిచ్చాడు. విరాట్ గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేనని తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.