ETV Bharat / sports

'కోహ్లీని రన్​ మెషీన్ అనొద్దు ఎందుకంటే' - latest virat kohli news

భారత కెప్టెన్ కోహ్లీపై ప్రశంసలు కురిపించిన పాక్ మాజీ క్రికెటర్ అబ్బాస్.. అతడు అన్ని ఫార్మాట్లలో నిలకడగా ఆడుతున్నాడని చెప్పాడు. అలానే ఆసీస్ బ్యాట్స్​మన్ స్మిత్ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

Steve Smith ahead in Tests but Virat Kohli best across all formats: Zaheer Abbas
'టెస్టుల్లో మాత్రమే స్టీవ్​... కానీ కోహ్లీ అన్నింట్లో'
author img

By

Published : Apr 14, 2020, 12:53 PM IST

ప్రసుత క్రికెట్‌లో‌ టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, స్టీవ్‌ స్మిత్(ఆస్ట్రేలియా)‌లలో ఎవరు అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది. ఇప్పుడీ విషయంపై తన అభిప్రాయాన్ని చెప్పాడు పాక్​ మాజీ క్రికెటర్​ జహీర్​ అబ్బాస్. అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడని తెలిపాడు.

"కోహ్లీ అన్ని ఫార్మాట్లలో నిలకడగా ఆడుతున్నాడు. అయితే టెస్టుల్లో మాత్రం అతడి కంటే స్మిత్‌ బాగా రాణిస్తున్నాడు. అయితే అత్యుత్తమం‌ అనిపించుకోవాలంటే ఒక్క ఫార్మాట్‌లో మెరుగ్గా ఆడితే సరిపోదు కదా! మూడు ఫార్మాట్లలోనూ బాగా ఆడాలి. ఆ విషయంలో కోహ్లీ మెరుగ్గా ఉన్నాడు. కోహ్లీని రన్‌ మెషీన్‌ అనకూడదు. ఎందుకంటే మెషీన్లు కొన్నిసార్లు రిపేర్‌కు వచ్చి పనిచేయవు. కానీ కోహ్లీ పరుగుల దాహానికి అలుపనేది ఉండదు. ప్రస్తుతం అతడికి సరితూగే బ్యాట్స్‌మన్‌ ఎవరూ లేరు"

-జహీర్‌ అబ్బాస్‌, పాకిస్థాన్​ మాజీ క్రికెటర్

అయితే ప్రస్తుతం కొందరు యువ క్రికెటర్లలో ఆటపట్ల అంకితభావం చూస్తున్నానని అన్నాడు జహీర్. దీనివల్ల త్వరలో కోహ్లీలాంటి వారు చాలామంది వస్తారని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Steve Smith ahead in Tests but Virat Kohli best across all formats: Zaheer Abbas
పాకిస్థాన్​ మాజీ బ్యాట్స్​మెన్​ జహీర్​ అబ్బాస్

ఇదీ చూడండి : వీరు మైదానంలో దిగితే రికార్డుల వరదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.