ETV Bharat / sports

'ముస్తాక్ అలీ టీ20 టోర్నీ నిర్వహణకు సై' - ముస్తాక్ అలీ ట్రోఫీ

దేశవాళీ క్రికెట్​ టోర్నీల నిర్వహణలో భాగంగా తొలుత ముస్తాక్ అలీ టీ 20 నిర్వహణకే తాము సిద్ధంగా ఉన్నట్లు పలు రాష్ట్రాలు బీసీసీఐకి తెలిపాయి. ముందుగా.. తమ అభిప్రాయం తెలపాలని బీసీసీఐ లేఖ రాయగా రాష్ట్రాలు ఈ విధంగా స్పందించాయి.

BCCI
'ముస్తాక్ అలీ టీ20 టోర్నీ నిర్వహించేందుకు సిద్ధం'
author img

By

Published : Dec 1, 2020, 6:07 PM IST

ముస్తాక్​ అలీ టీ20 టోర్నీ నిర్వహణకే సిద్ధంగా ఉన్నామని భారత క్రికెట్​ బోర్డుకు తెలిపాయి పలు రాష్ట్రాల క్రికెట్ సంఘాలు. దేశవాళీ క్రికెట్ టోర్నీల నిర్వహణపై బుధవారంలోగా తమ అభిప్రాయాల్ని తెలపాలని బీసీసీఐ కోరగా రాష్ట్రాలు ఈ విధంగా స్పందించాయి.

దాదాపు చాలా రాష్ట్రాలు టీ20 నిర్వహణకే సిద్ధంగా ఉన్నట్లు తెలపగా కొన్ని సంఘాలు టీ20తో పాటు రంజీ ట్రోఫీ కూడా నిర్వహించే అవకాశమిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాయి. మరికొన్ని సంఘాలు విజయ్​ హజారే ట్రోఫీ నిర్వహణకు సిద్ధమని సంకేతాలిచ్చాయి. ఈ మేరకు కొన్ని రాష్ట్ర సంఘాలు బీసీసీఐ అధ్యక్షుడికి లేఖ రాశాయి. తొలుత టీ20 నిర్వహించి, తర్వాత ఇతర టోర్నీల నిర్వహణ గురించి ఆలోచించాలని కోరాయి. ఈ నిర్వహణలో భాగంగా బయో బబుల్ ఏర్పాట్ల గురించి కూడా యోచించాలని పేర్కొన్నాయి.

ఇదీ చదవండి:దేశవాళీ క్రికెట్​ షెడ్యూల్​ బ్లూ ప్రింట్​ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.