ETV Bharat / sports

పాకిస్థాన్​కు బయలుదేరిన లంక జట్టు - Sri Lanka squad leave for Pakistan despite security concerns

పాకిస్థాన్​ గడ్డపై మ్యాచ్​లు ఆడేందుకు శ్రీలంక జట్టు బయలుదేరింది. సెక్యూరిటీ విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన లంక ఆటగాళ్లు ఎట్టకేలకు సిరీస్​ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

లంక
author img

By

Published : Sep 24, 2019, 4:56 PM IST

Updated : Oct 1, 2019, 8:20 PM IST

సెక్యూరిటీ విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం చేసిన శ్రీలంక జట్టు ఎట్టకేలకు పాకిస్థాన్ బయలుదేరింది. భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన లేదని తెలిపింది.
2009 లాహోర్​ పేలుడు తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వెళ్లడానికి చాలా జట్లు విముఖత వ్యక్తం చేశాయి. ఫలితంగా తమ మ్యాచ్​లను యూఏఈకి మార్చుకుంది పాక్. కానీ స్వదేశంలో సిరీస్​ల నిర్వహణకు పట్టుబట్టిన పీసీబీ ఎట్టకేలకు విజయం సాధించింది. పాక్​ గడ్డపై ఆడేందుకు లంకను ఒప్పించింది.

షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 27నుంచి పాక్​తో మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్​ల సిరీస్ ప్రారంభంకానుంది. ఇందుకోసం పాక్ వెళ్లడానికి ముఖం చాటేసిన లంక ఆటగాళ్లు తాజాగా అందుకు సిద్ధమయ్యారు.

"సెక్యురిటీ విషయంలో ఎలాంటి ఆందోళన లేదు. టీ20ల్లో లంకను ముందుండి నడిపించడం ఆనందంగా ఉంది. పాక్​ జట్టును సమర్థవంతంగా ఎదుర్కొంటామని అనుకుంటున్నా."
-దసున్ షనక, శ్రీలంక టీ20 సారథి

శ్రీలంక-పాకిస్థాన్ మధ్య సెప్టెంబర్ 27,29, అక్టోబర్ 2న వన్డే మ్యాచ్​లు జరగనున్నాయి. అక్టోబర్ 5,7,9లలో మూడు టీ20లు జరగనున్నాయి.

ఇవీ చూడండి.. దిగ్గజ క్రికెటర్​ షేన్​వార్న్​పై ఏడాది నిషేధం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 1, 2019, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.