ETV Bharat / sports

ఐపీఎల్ నిర్వహణకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఆసక్తి - ఐపీఎల్ వాయిదా

కరోనా కారణంగా ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది. అయితే ఈ లీగ్​ను నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ విషయమై త్వరలోనే బీసీసీఐకి లేఖ రాస్తామని స్పష్టం చేసింది.

Sri Lanka
Sri Lanka
author img

By

Published : Apr 17, 2020, 5:15 AM IST

కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్​) 13వ సీజన్​ నిరవధిక వాయిదా పడింది. ఇప్పటికే భారత్​లో లాక్​డౌన్ కారణంగా మిగలిన క్రీడా టోర్నీలు కూడా వాయిదా పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్​ను నిర్వహించే అవకాశం లేదని బీసీసీఐ వెల్లడించింది. అయితే ఈ క్రికెట్​ లీగ్​ను నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వ తెలిపారు.

" భారత్ కంటే శ్రీలంకలో కరోనా ప్రభావం తొందరగా తగ్గుతుందని అనుకుంటున్నాం. అందువల్ల ఐపీఎల్​ను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. దీనిపై బీసీసీఐకి త్వరలోనే లేఖ రాస్తాం."

-షమ్మీ సిల్వ, శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు

ఐపీఎల్-2020 వాయిదా పడటం ఇది రెండోసారి. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఈ టోర్నీని మొదట ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. కానీ కరోనా ప్రభావం దృష్టిలో ఉంచుకుని లాక్​డౌన్​ను రెండోసారి పొడిగించిన నేపథ్యంలో.. మరోసారి ఈ మెగాటోర్నీ నిరవధిక వాయిదా పడింది. పరిస్థితులు మెరుగయ్యాక లీగ్ నిర్వహణపై ఓ స్పష్టత ఇస్తామని ఇప్పటికే స్పష్టం చేసింది బీసీసీఐ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.