ETV Bharat / sports

డెత్​ ఓవర్​ స్పెషలిస్టులు ఉన్నారు జాగ్రత్త! - సన్​రైజర్స్​ హైదరాబాద్​ న్యూస్​

ఐపీఎల్​లో అత్యుత్తమ డెత్​ ఓవర్​ స్పెషలిస్టు బౌలర్లు సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టులోనే ఉన్నారని ఆ జట్టు కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​ అభిప్రాయపడ్డాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థులకు వారు ధీటుగా బదులిస్తారని తెలిపాడు. ఈ విషయాన్ని ఇన్​స్టా లైవ్​ సెషన్​లో తాజాగా వెల్లడించాడు.

SRH has the best death bowling in IPL: Warner
డెత్​ ఓవర్​ స్పెషలిస్టులు ఉన్నారు జాగ్రత్త!
author img

By

Published : Apr 24, 2020, 7:35 PM IST

సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టులో ఎక్కువ మంది డెత్​ ఓవర్​ స్పెషలిస్టు బౌలర్లు ఉన్నారని ఆ జట్టు కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​ అన్నాడు. భువనేశ్వర్​ కుమార్​, లెగ్​ స్పిన్నర్​ రషీద్​ ఖాన్​లు డెత్​ ఓవర్లలో ప్రత్యర్థికి ధీటుగా బదులిస్తారని తెలిపాడు. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన వార్నర్​ తాజాగా సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టు వికెట్​ కీపర్​ బెయిర్​ స్టోతో ఇన్​స్టాగ్రామ్​ లైవ్​ చాట్​ సెషన్​లో పాల్గొన్నాడు. నెటిజన్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు వారిద్దరూ సమాధానమిచ్చారు.

"మా జట్టులో ఉత్తమ ఆటగాళ్లు ఉన్నారు. డెత్​ ఓవర్​ స్పెషలిస్టు బౌలర్లు ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. టోర్నీలో ఉన్న అన్ని జట్లకు ధీటుగా పోటీనిచ్చే అత్యుత్తమ బౌలింగ్​ లైనప్​ మాకు ఉంది" అని డేవిడ్​ వార్నర్​ అన్నాడు.

ఇదీ చూడండి.. పనిమనిషికి అంత్యక్రియలు నిర్వహించిన గంభీర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.