ETV Bharat / sports

నిషేధం పూర్తయింది.. ఇక ఆటకు రెడీ: శ్రీశాంత్​ - sreesanth cricketer

స్పాట్​ ఫిక్సింగ్​ కారణంగా నిషేధానికి గురైన టీమ్​ఇండియా ఫాస్ట్​ బౌలర్​ శ్రీశాంత్​ శిక్షా కాలం ఆదివారంతో ముగిసింది. దీనిపై అతడు హర్షం వ్యక్తం చేశాడు. త్వరలోనే మళ్లీ దేశవాళీ క్రికెట్​ ఆడతానని తెలిపాడు.

Sreesanth'
శ్రీశాంత్
author img

By

Published : Sep 13, 2020, 1:59 PM IST

మ్యాచ్​ ఫిక్సింగ్​ ఆరోపణలతో ఏడేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్న టీమ్​ఇండియా పేసర్​ శ్రీశాంత్​ శిక్షా కాలం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన అతడు.. ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఇకపై ఆటకు అందుబాటులో ఉంటానని చెప్పాడు. త్వరలోనే దేశవాళీ క్రికెట్​ కెరీర్​ను మళ్లీ ​ప్రారంభిస్తానని తెలిపాడు. టీమ్​ఇండియాలోనూ తిరిగి స్థానం దక్కించుకుంటాననే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నాడు.

"ఇప్పుడు నాపై ఉన్న నిషేధం పూర్తిగా తొలగిపోయింది. ఇకపై నాకు ఎంతో ఇష్టమైన క్రికెట్​ను ఆడగలను. ఏ జట్టు తరఫున ఆడినా నా వంతు ప్రయత్నంగా బాగా రాణిస్తాను".

-శ్రీశాంత్​, టీమ్​ఇండియా పేసర్​.

ప్రస్తుతం కరోనా కారణంగా దేశవాళీ క్రికెట్​ వాయిదా పడింది. దీన్ని పునః ప్రారంభించేందుకు బీసీసీఐ అన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డులతో చర్చలు జరుపుతోంది. శ్రీశాంత్​ తన ఫిట్​నెస్​ను నిరూపించుకుంటే తమ తరఫున ఆడే అవకాశాన్ని ఇస్తామని ప్రకటించింది కేరళ బోర్డు.

2013లో మ్యాచ్​ ఫిక్సింగ్​ కారణంగా శ్రీశాంత్​పై జీవితకాల నిషేధం విధించింది బీసీసీఐ. అయితే సుప్రీం ఆ నిషేధాన్ని ఇటీవల ఎత్తివేస్తూ.. శిక్షను ఏడేళ్లకు కుదించింది. అది నేటితో ముగుస్తుంది. టీమ్​ఇండియా తరఫున శ్రీశాంత్​ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్​లు ఆడాడు.

ఇదీ చూడండి ఐపీఎల్​ 2020: ప్రాక్టీసులో వికెట్​ విరగ్గొట్టిన బౌల్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.