ETV Bharat / sports

మొతేరా పిచ్​పై కోహ్లీ అంచనాలు ఇలా...

ఫిబ్రవరి 24 నుంచి జరగనున్న మూడో టెస్టులో పిచ్..​ స్పిన్​తో పాటు సీమ్​కు సహకరించే అవకాశముందని భారత సారథి కోహ్లీ అభిప్రాయపడ్డాడు. గులాబీ బంతి స్పిన్నర్లకు మాత్రమే కాకుండా పేసర్లకూ అనుకూలిస్తుందని తెలిపాడు.

Spinners will come into play for sure but pacers can't be ignored either in pink-ball Test: Kohli
'పింక్​ బాల్​ స్పిన్నర్లతో పాటు పేసర్లకు కూడా..!'
author img

By

Published : Feb 23, 2021, 5:05 PM IST

పింక్ టెస్టుకు వేదికైన మొతేరా పిచ్​ స్పిన్​కు సహకరిస్తుందని విశ్లేషకులు భావిస్తుండగా.. భారత కెప్టెన్​ విరాట్​ కోహ్లీ మాత్రం పేసర్లకూ అవకాశాలు కొట్టి పారేయలేమని పేర్కొన్నాడు.

నాలుగు టెస్టుల సిరీస్​లో ఇరు జట్లు 1-1 ఆధిక్యంతో ఉన్నాయి. దీంతో ఫిబ్రవరి 24న ప్రారంభమయ్యే మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఇటీవలే పునఃనిర్మించిన మొతేరా మైదానం..​ స్పిన్​కు సహకరిస్తుందా? లేదా సీమ్​కు కలిసొస్తుందా? అనేది ప్రధానాంశమైంది.

బంతి పాతబడేంత వరకు స్వింగ్​కు సహకరిస్తుందనేది కోహ్లీ అంచనా. "బంతి కచ్చితంగా స్వింగ్ అవుతుందా అనేది తెలియదు. కానీ, పేసర్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తారు. ఎరుపు బంతితో పోలిస్తే గులాబీ బంతి ఎక్కువగా స్వింగ్​ అవుతుంది. 2019లో బంగ్లాదేశ్​తో ఆడిన పింక్​ టెస్టు ద్వారా మాకు ఈ విషయం అర్థమైంది" అని భారత కెప్టెన్​ చెప్పాడు.

బంతి ఒకవేళ సీమ్​కు అనుకూలిస్తే.. అది తమకు కలిసొస్తుందన్న ఇంగ్లాండ్ జట్టు అంచనాపై కోహ్లీ స్పందించాడు.

"పర్యటక జట్టులోనూ చాలా బలహీనతలు ఉన్నాయి. ఇంగ్లాండ్ టీమ్​ బలాలు, బలహీనతల గురించి మాకు అవసరం లేదు. గతంలో వారి దేశంలోనే వారిని ఓడించాము. ఒకవేళ పిచ్​ పేసర్లకు సహకరిస్తే అది వారికి మాత్రమే కాదు.. మాక్కూడా ఉపయోగమే. కొత్తగా నిర్మించిన స్టేడియంలో ఇరు జట్లకు చాలా విషయాలపై అవగాహన లేదు. పేసర్లకు, స్పిన్నర్లకు పింక్​ బాల్​ ఎలా సహకరిస్తుందనే దానిపైనే ఇండియా బలం ఆధారపడి ఉంది. మా జట్టులోనూ అత్యుత్తమ బౌలర్లు ఉన్నారు. ఏది ఎలా ఉన్నా మేము ఆడటానికి సిద్ధమే"

-విరాట్​ కోహ్లీ, భారత కెప్టెన్.

"ఎరుపు బంతితో పోలిస్తే గులాబీ బంతితో ఆడటం సవాలుతో కూడినది.. దీనికి పిచ్​తో సంబంధం లేదు. ఈ టెస్టులో స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషిస్తారనేది వాస్తవమే. కానీ, కొత్త బంతితో బౌలింగ్​ చేసేటప్పుడు పేసర్ల పాత్రను తీసిపారేయలేము' అని అన్నాడు విరాట్.

మొతేరా పిచ్​ స్పిన్​కు సహకరిస్తుందని భారత సీనియర్​ బ్యాట్స్​మెన్​ రోహిత్​ శర్మ ఇదివరకే తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి: విజయ్ హజారే ట్రోఫీలో కరోనా కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.