ETV Bharat / sports

టెస్టు​ ఛాంపియన్​షిప్:2 ఏళ్లు సాగే క్రికెట్​ యాత్ర - విరాట్ కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్​ మండలి​(ఐసీసీ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ప్రపంచకప్​ సమరం  క్రికెట్​ అభిమానులను ఎంతో అలరించింది. మరోసారి అంతే జోష్​​ అందించేందుకు సరికొత్త ఆలోచనతో ముందుకు వస్తోంది ఐసీసీ. అదే ప్రపంచ టెస్టు​ ఛాంపియన్​షిప్​.

టెస్టు​ ఛాంపియన్​షిప్:2 ఏళ్లు సాగే క్రికెట్​ యాత్ర
author img

By

Published : Aug 2, 2019, 7:00 AM IST

టీ20 ఫార్మాట్​ రాకతో క్రికెట్​ దశ, దిశ మారిపోయాయి. బ్యాట్​-బంతి ఆట​ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పొట్టి క్రికెట్​ లీగ్​లు బాగా ఉపయోగపడుతున్నాయి. మరి ఇంతగా ఆదరణ పొందిన ఆటకూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవే 50 ఓవర్ల ఆట, ఐదు రోజులు జరిగే టెస్టు​ మ్యాచ్​ల పట్ల ప్రజలకు కాస్త ఆసక్తి తగ్గడం. వన్డేలను రసవత్తరంగా మార్చేందుకు ఇప్పటికే రౌండ్​ రాబిన్​ పద్ధతిలో వరల్డ్​కప్​ను, ఆకట్టుకునే సిరీస్​లను తీసుకొచ్చింది. మరి టెస్టు క్రికెట్​లోనూ మార్పులు చేయాలన్న ఐసీసీ ఆలోచన నుంచి వచ్చిందే వరల్డ్​ టెస్టు​ ఛాంపియన్​షిప్(డబ్ల్యూటీసీ)​. దాని విశేషాలు చూద్దాం...

TEST CHAMPIONSHIP TROPHY
టెస్టు ఛాంపియన్​షిప్​ విజేతకు ఇచ్చే గద

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ అంటే..?

ఈ ఏడాది ఆగస్ట్​ 1 నుంచి టెస్టు ఛాంపియన్​షిప్​ను ప్రారంభిస్తోంది అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ). ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్​ మధ్య జరగుతున్న యాషెస్​ సిరీస్​ నుంచే ఈ యాత్ర ప్రారంభం కానుంది.

  1. ప్రపంచ క్రికెట్​లో టాప్​-9 జట్లు కలిసి 2 ఏళ్ల పాటు 27 సిరీస్​లు ఆడతాయి. ఫైనల్​తో కలిపి మొత్తం 72 మ్యాచ్​లు ఈ ఛాంపియన్​షిప్​లో ఉంటాయి.
  2. ప్రతి జట్టు 3 సిరీస్​లు​ స్వదేశంలో, మరో మూడు సిరీస్​లు విదేశాల్లో ఆడతాయి.
  3. ఈ రెండేళ్ల కాలంలో జరిగిన ప్రతి మ్యాచ్​కు కొన్ని పాయింట్లు ఉంటాయి. ఈ కాలపరిమితి ముగిసే లోపల ఛాంపియన్​షిప్​ పాయింట్ల పట్టికలో ఏ జట్లయితే టాప్-2​లో ఉంటాయో అవి మాత్రమే ఫైనల్​ చేరి ట్రోఫీ కోసం పోటీపడతాయి.
  4. 2021 జూన్​లో ఇంగ్లాండ్​లోని లార్డ్​ వేదికగా ఫైనల్​ మ్యాచ్​ జరుగుతుంది. గెలిచిన జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ను కైవసం చేసుకుంటుంది. ఇదే తొలిసారి కావడం వల్ల దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

ఉద్దేశం ఏంటి..?

డబ్ల్యూటీసీ ముఖ్య ఉద్దేశం టెస్టు క్రికెట్​ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం. ప్రతి మ్యాచ్​కు పాయింట్లు ఉండటమే కాకుండా ప్రపంచ అత్యత్తమ జట్లే ఇందులో పోటీపడతాయి.

9 జట్లను ఎలా ?

2018 , మార్చి 31న ఐసీసీ ప్రకటించిన టెస్టు​ ర్యాంకింగ్స్​ ఆధారంగా టాప్​-9 జట్లకు ఇందులో అవకాశం లభించింది. ఈ ర్యాంక్​ల ఆధారంగానే ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్​, ఇంగ్లాండ్​, భారత్​, న్యూజిలాండ్​, పాకిస్థాన్​, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్​ ఈ ఛాంపియన్​షిప్​లో స్థానం దక్కించుకున్నాయి.

ఎక్కడ ఆడతాయి..?

రెండేళ్ల కాలం పాటు వివిధ దేశాల్లో ఈ మ్యాచ్​లు జరుగుతాయి. 2019 ఆగస్ట్​ నుంచి ఈ మ్యాచ్​లు ఆరంభమయ్యాయి.

ఫార్మాట్​ ఏంటి..?

ఒక్కో జట్టు స్వదేశంలో 3, విదేశాల్లో 3 మ్యాచ్​లు ఆడతాయి. మ్యాచ్​ ఆడే జట్ల మధ్య పరస్పర అంగీకారం ఉంటుంది. ప్రతి సిరీస్​లో మ్యాచ్​ల సంఖ్య ఒకేలా ఉండవు. రెండు నుంచి ఐదు మ్యాచ్​లు కలిపిన సిరీస్​లు ఉంటాయి.

డే అండ్​ నైట్​ మ్యాచ్​లు..?

ఐదు రోజుల మ్యాచ్​లను రాత్రి-పగలు కలిపి ఆడించే అవకాశం ఉంది. కాని ఇది ఇరు జట్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

పాయింట్లు ఎలా.?

ప్రతి జట్టు 6 సిరీస్​లు ఆడుతుంది. ఒక్కో సిరీస్​కు 120 పాయింట్లు కేటాయించారు. ఒక సిరీస్​లో ఎన్ని మ్యాచ్​లు ఉంటే ఆ పాయింట్లను అన్ని భాగాలు చేస్తారు.(ఉదా:- నాలుగు మ్యాచ్​లు ఉంటే ఒక్కో మ్యాచ్​కు 30 పాయింట్లు, 3 మ్యాచ్​లు ఉంటే ఒక్కో మ్యాచ్​కు 40 పాయింట్లు కేటాయిస్తారు.)

TEST CHAMPIONSHIP POINTS DISTRIBUTING SYSTEM
టెస్టు ఛాంపియన్​షిప్​ పాయింట్లు ఇచ్చే విధానం

మ్యాచ్​ టై(స్కోర్లు సమం) అయితే పాయింట్లను రెండు జట్లకు సగంగా పంచుతారు. మ్యాచ్​ డ్రా(ఐదు రోజులైనా ఫలితం తేలకపోతే) అయితే పాయింట్లను 3:1 నిష్పత్తిలో కేటాయిస్తారు.

నిర్వహణ ఐసీసీ మాత్రమేనా?

అంతర్జాతీయ క్రికెట్​ మండలిలో భాగస్వామ్యం పొందిన సభ్య దేశాలతో కలిసి భవిష్యత్​ ప్రణాళిక రూపొందిస్తుంది ఐసీసీ. ప్రస్తుతం టెస్టు క్రికెట్​లో ఉన్న నియమాలే ఉంటాయి. పాయింట్లు అనే కొత్త అంశం తీసుకొచ్చారు.

వేదికలు, ప్రచారం, టికెట్లు వంటి అంశాలన్నీ ఆతిథ్య దేశానికి చెందిన బోర్డులే చూసుకుంటాయి. నియమ నిబంధనలు ఉల్లంఘన జరగకుండా పర్యవేక్షణ మాత్రం ఐసీసీ చూసుకుంటుంది. ఫైనల్​ నిర్వహణ ఐసీసీ చేతిలోనే ఉంటుంది.

ఎప్పటి నుంచి ఎప్పటివరకు..?

2019, ఆగస్ట్​ 1 నుంచి 2021, మార్చి 31 వరకు ప్రణాళిక ఆధారంగా తొలి రౌండ్​ మ్యాచ్​లు జరుగుతాయి. రెండో ఛాంపియన్​షిప్​​ 2021 జూన్​ నుంచి 2023 ఏప్రిల్​ 30 వరకు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది ఐసీసీ.

SERIES LIST IN TEST CHAMPIONSHIP
టెస్టు ఛాంపియన్​షిప్​లో సిరీస్​ల వివరాలు
ప్రతి సిరీస్​కు బ్రాడ్​కాస్ట్​ హక్కులు మారుతాయి. ఇవి ఆతిథ్య దేశంలోని బోర్డు తీసుకొనే నిబంధనల మీద ఆధారపడి ఉంటుంది. 2021 జూన్​లో జరిగే ఫైనల్​ ప్రదర్శన మాత్రమే ఐసీసీ నిర్ణయిస్తుంది.

టెస్టు ర్యాంకింగ్స్​-పాయింట్లు ఒకటేనా.?

సాధారణంగా ప్రతి ఏడాది 12 జట్లతోనే ర్యాంకింగ్స్​ ఇస్తుంటుంది ఐసీసీ. అయితే డబ్ల్యూటీసీ పట్టిక (9 జట్లు)లో ఉన్న పాయింట్లు వేరు. ఇవి ఛాంపియన్​షిప్​కు మాత్రమే పరిమితం. జింబాబ్వే, ఐర్లాండ్​, ఆఫ్గనిస్థాన్​ జట్లు ఆడే మ్యాచ్​లు ఈ ఛాంపియన్​​ షిప్​ కిందకు రావు. ప్రస్తుతం జింబాబ్వేపై ఐసీసీ నిషేధం ఉంది.

టీమిండియా​ షెడ్యూల్​:

VIRAT KOHLI WITH TEST GADHA
టెస్టు గదతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

జులై-ఆగస్ట్ 2019 : రెండు టెస్టులు(వెస్టిండీస్​లో)

అక్టోబర్-నవంబర్ 2019 : దక్షిణాఫ్రికాతో 3 టెస్టు​లు(స్వదేశంలో)

నవంబర్ 2019 : బంగ్లాదేశ్​తో 2 టెస్టు​లు ​(స్వదేశంలో)

ఫిబ్రవరి 2020 : రెండు టెస్టులు(న్యూజిలాండ్​లో)

డిసెంబర్ 2020 : నాలుగు టెస్టు​లు​(ఆస్ట్రేలియాలో)

జనవరి-ఫిబ్రవరి 2021 : ఇంగ్లాండ్​తో 5 టెస్టు​​లు(స్వదేశంలో)

ఇది చదవండి: టెస్టు ఛాంపియన్​షిప్​ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని చెప్పిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Rome - 1 August 2019
1. Exterior of Regina Coeli prison
2. Sign on prison
3. SOUNDBITE (Italian) Fabio Alonzi, lawyer of Gabriel Christian Natale-Hjorth:
"(Reporter question: how is your client?) Same as yesterday, he is a very worn out boy, very worn out. Nothing has changed since yesterday. Very worn out."
Reporter: "When will the father come to visit him?"
Alonzi: "In the next few days."
Reporter: "Not today?"
Alonzi: "No, he came already yesterday. I don't have any further comment to give."
Reporter: "Can you repeat how is he?"
Alonzi: "Very worn out."
4. Various of area surrounding prison
5. Security camera
6. Exterior of prison
STORYLINE:
A lawyer for 18-year-old Gabriel Christian Natale-Hjorth, a teenager who has been jailed along with 19-year-old Finnegan Lee Elder in Rome in the fatal stabbing of an Italian police officer, says his client is "worn out."
Fabio Alonzi was speaking outside Regina Coeli prison after meeting his client.
Investigators contend that Finnegan Lee Elder stabbed Carabinieri Deputy Brigadier Mario Cerciello Rega 11 times with a military-style attack knife early Friday near the hotel where he was staying with his friend.
According to court documents, Elder told prosecutors during his interrogation that he thought he was being strangled in a scuffle with the officer.
But prosecutors say there were no signs of physical injury on either teen.
Under Italian law, both the defendant who materially carries out a killing and others involved in the crime can each be charged with murder.
A day earlier, Elder's mother, in San Francisco, told private Italian TGCom24 that the family was "heartbroken" over the officer's death.
She added that the teens' travel plans "came together at the last minute."
Prosecutors said police found the knife used in the slaying hidden in the dropped ceiling of the Americans' hotel room.
Investigators said Elder told them he had brought the knife with him from the United States.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.