ETV Bharat / sports

మన కుర్రాళ్లు... జోరుమీదున్నారు!

ఆస్ట్రేలియాపై మరపురాని విజయాన్ని అందించిన గెలుపు గుర్రాలు.. ఈ కుర్రాళ్లు. ఒక్క పర్యటనతో హీరోలైన ఈ యువ క్రికెటర్ల గెలుపు వెనకాల అంతులేని కృషి దాగిఉంది. టీమ్​ఇండియాకు చారిత్రక విజాయాన్ని అందించిన సిరాజ్, శార్దుల్, సుందర్, గిల్​, పంత్​ల ఉద్వేగభరిత కథను తెలుసుకుందామా..

special story on team india youngsters
కుర్రాళ్లు... జోరు మీదున్నారు!
author img

By

Published : Jan 31, 2021, 8:28 PM IST

వెయ్యి వికెట్లు తీసిన అనుభవం ఉన్న ఆసీస్‌ బౌలర్లు ఒకవైపు... పది వికెట్లు తీసిన భారత కుర్రాళ్లు మరోవైపు. గబ్బా మైదానంలో ఒక్క టెస్టూ ఓడని చరిత్ర ఉన్న ఆస్ట్రేలియా నిబ్బరం ఒకవైపు... అక్కడే ఓడించి చరిత్ర తిరగరాయాలన్న టీమ్‌ ఇండియా లక్ష్యం మరోవైపు. చివరకు ఉరకలేసే ఉడుకురక్తం ముందు అలసిన అనుభవం చతికిలపడింది. గెలవడానికి కావాల్సింది చరిత్ర కాదు సత్తా అని నిరూపితమైంది. గబ్బాలో ఆసీస్‌ను ఓడించి 2-1తో సిరీస్‌ని సొంతం చేసుకుంది భారత్‌. ఇంతటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఈ కుర్రాళ్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ! ప్రతి జెర్సీ వెనకా ఉద్వేగంతో గుండెని ఊపేసే స్ఫూర్తి గాథ!

గల్లీ బాయ్‌... మియా భాయ్‌!

special story on team india youngsters
సిరాజ్

పదోతరగతి, ఇంటర్మీడియెట్‌ బోర్డు పరీక్షల ఫలితాల్లో కొన్ని సబ్జెక్టుల దగ్గర 'ఆబ్సెంట్‌' అని రాసుండేది మహమ్మద్‌ సిరాజ్‌కి. అయినా ఇంట్లో వాళ్లకి అదేం ఆశ్చర్యం కలిగించేది కాదు. ఎందుకంటే, ఆరోజు ముఖ్యమైన క్రికెట్‌ మ్యాచ్‌ ఉండుంటుందని ఊరుకునేవారు. చదువుకంటే క్రికెట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నాడంటే వాడి భవిష్యత్తు అక్కడే ఉండొచ్చని ప్రోత్సహించేవారు. అలాగని వాళ్లది ఆర్థికంగా ఉన్నత కుటుంబం కాదు. తండ్రి గౌస్‌ ఆటో డ్రైవర్‌. ఉండేది అద్దె ఇంట్లోనే. క్రికెట్‌లో ఓనమాల్ని కోచింగ్‌ సెంటర్లో దిద్దలేదు సిరాజ్‌. హైదరాబాద్‌లోని టోలీచౌకీ ప్రాంతంలో టెన్నిస్‌ బాల్‌తో గల్లీ క్రికెట్‌ ఆడుతూ నేర్చుకున్నాడు. స్థానిక ఈద్గా మైదానమే అతడి శివాజీ పార్క్‌. అతడి బంతి వేగానికి వికెట్లు పిట్టల్లా రాలేవి. ఉదయం, సాయంత్రం రెండు పూటలూ మ్యాచ్‌లే. మొదట్లో ఇదంతా ఇంట్లోవాళ్లకి నచ్చేది కాదు. 'అన్న ఇంజినీరింగ్‌ చదువుతుంటే నువ్వు ఆటలంటూ టైమ్‌ వృథా చేస్తున్నావ్‌. పెద్దయితే ఎలా బతుకుతావో ఏంటో' అని అమ్మ కోప్పడితే.. 'చూస్తుండమ్మా, ఇల్లు సరిపడనంత డబ్బు తెస్తా' అని బదులిచ్చేవాడు సిరాజ్‌. మ్యాచ్‌ గెలిస్తే ఎంతో కొంత డబ్బు వచ్చేది. అలా ఓసారి ఒకే ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు తీస్తే రూ.500 రావడం తనకింకా గుర్తేనంటాడు సిరాజ్‌. అతడికి 18 ఏళ్లు వచ్చాక... ఓ క్లబ్‌ క్రికెటర్‌ సిరాజ్‌ ప్రతిభను గుర్తించి ప్రొఫెషనల్‌ క్రికెట్‌లోకి వెళ్లమని సలహా ఇచ్చాడు. తనకు ఆ దారి తెలీదని చెబితే, స్థానిక క్లబ్‌ తరఫున ఆడేలా ఓ మార్గం చూపాడు. క్లబ్‌ తరఫున ఏడు మ్యాచ్‌లలో 59 వికెట్లు తీయడం వల్ల సిరాజ్‌కి హైదరాబాద్‌ క్రికెట్‌ వర్గాల్లో గుర్తింపు వచ్చింది. 2015-16 సీజన్లో హైదరాబాద్‌ అండర్‌-23లో, ఆపైన కొద్ది నెలలకి రంజీ జట్టులో స్థానం సంపాదించాడు. 2016లో ఐపీఎల్‌ ఆడటానికి హైదరాబాద్‌ వచ్చిన బెంగళూరు జట్టుకి నెట్‌ బౌలర్‌గా వెళ్లాడు సిరాజ్‌. ప్రస్తుత భారత జట్టు బౌలింగ్‌ కోచ్‌ అరుణ్‌ భరత్‌ బెంగళూరు బృందంలో ఉన్నాడు. అక్కడ సిరాజ్‌ ప్రతిభను చూసి ఏదో ఒకరోజు టీమ్​ఇండియాకు ఆడతావని జోస్యం చెప్పాడు. 2016-17 రంజీ సీజన్లో హైదరాబాద్‌ జట్టుకు కోచ్‌గా వచ్చిన అరుణ్‌ నుంచి పూర్తి ప్రోత్సాహం అందింది సిరాజ్‌కి. ఆ సీజన్లో అత్యధిక వికెట్లు(41) తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. 2017 ఐపీఎల్‌ వేలంలో హైదరాబాద్‌, బెంగళూరు జట్లు సిరాజ్‌ని దక్కించుకోవడానికి పోటీపడ్డాయి. చివరకు రూ.2.6 కోట్లకు సొంతం చేసుకుంది హైదరాబాద్‌. 2017లో టీ20ల్లో... 2018లో వన్డేల్లో టీమిండియాకు ఆడాడు సిరాజ్‌. జాతీయ జట్టుకు ఎంపికవ్వగానే నాన్నని ఆటో నడపడం మాన్పించేశాడు. పెద్ద ఇల్లు కొనిచ్చాడు. తల్లిదండ్రుల్ని హజ్‌ యాత్రకు తీసుకువెళ్లాడు.

special story on team india youngsters
మియా భాయ్

బెంగళూరు జట్టు తరఫున గతేడాది దుబాయ్​లో ఐపీఎల్‌ ఆడటానికి సిరాజ్‌ బయలుదేరేటప్పటికే తండ్రి ఆరోగ్యం బాగాలేదు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడేవాడు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళనలో ఉండేవాడు సిరాజ్‌. ఆ పరిస్థితుల్లోనే ఆస్ట్రేలియా వెళ్లాడు. నవంబరులో తండ్రి చనిపోయినపుడు అంత్యక్రియలకు హాజరవ్వలేకపోయాడు. అక్కడే ఉండి టెస్టు క్రికెట్‌ ఆడాలన్న తండ్రి కలను నిజం చేయాలనుకున్నాడు. అమ్మకు ఫోన్‌చేస్తే ఆవిడా ఆమాటే చెప్పింది. టెస్టుల్లో మూడు మ్యాచ్‌లలో 13 వికెట్లు తీసి సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్‌... ప్రతి వికెట్‌నీ తన తండ్రికి అంకితం ఇచ్చాడు. మ్యాచ్‌కి ముందు జాతీయ గీతం ఆలపించిన ప్రతిసారీ తండ్రి ఆటో నడపడం, తానుపడ్డ కష్టాలూ, నాన్న ప్రోత్సాహం... అన్నీ గుర్తొస్తాయనీ, కళ్లు తడి అవుతాయనీ చెబుతాడు సిరాజ్‌.

ఏడేళ్లపుడే తలకి నాలుగు కుట్లు...

special story on team india youngsters
సుందర్

ఆస్ట్రేలియాతో తన అరంగేట్ర టెస్ట్‌ మ్యాచ్‌లో బంతితోపాటు బ్యాట్‌తోనూ అదరగొట్టాడు వాషింగ్టన్‌ సుందర్‌. నెట్‌ బౌలర్‌గా ఆస్ట్రేలియా వెళ్లిన అతడికి నాలుగో టెస్టులో ఆడే అవకాశం వచ్చిందని తెలిసేసరికి చెన్నైలోని అతడి కుటుంబం ఈసారి పొంగల్‌ని మరింత గొప్పగా చేసుకుంది. వాషింగ్టన్‌ టెస్ట్‌ క్యాప్‌ అందుకోవడం చూడ్డానికి వేకువజామున మూడున్నరకే నిద్రలేచి టీవీకి అతుక్కుపోయారు. వాషింగ్టన్‌ తండ్రి మణి సుందర్‌ కూడా క్రికెటర్‌ అవ్వాలని కలలుగనేవారు. మణి బ్యాటింగ్‌ ప్రతిభ చూసి పీడీ వాషింగ్టన్‌ అనే రిటైర్డ్‌ ఆర్మీ అధికారి... అతడిని అన్నివిధాలా ప్రోత్సహించేవాడు. రంజీ ప్రాబబుల్స్‌కి ఎంపికైన మణి కెరీర్‌లో ఆ తర్వాతి మెట్టు ఎక్కలేకపోయారు. నామకరణం రోజున కొడుక్కి శ్రీనివాసన్‌ అని పేరు పెట్టినా, తనకి గాడ్‌ఫాదర్‌గా నిల్చిన వాషింగ్టన్‌మీద అభిమానంతో రికార్డుల్లో మాత్రం ఆ పేరు రాయించారు. కిండర్‌గార్టెన్‌లో ఉన్నపుడే కొడుకుచేత టెన్నిస్‌ బాల్‌తో క్రికెట్‌ ఆడించేవారు మణి. ఏడేళ్లపుడు నెట్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న వాషీ హెల్మెట్‌ మీద క్రికెట్‌ బాల్‌ ఫుల్‌టాస్‌గా వచ్చి పడటం వల్ల తలమీద లోతైన గాయమైంది. నాలుగు కుట్లు వేసి కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోమన్నారు వైద్యులు. కానీ మూడో రోజు అంతర్‌ పాఠశాలల మ్యాచ్‌లో ఆడి 30కి పైగా పరుగులు చేసి జట్టుని గెలిపించాడు. వాషింగ్టన్‌తో పాటు అతడి అక్క శైలజ కూడా బ్యాటింగ్‌ నేర్చుకుంది. ఆరో తరగతిలో ఉన్నపుడే రాష్ట్ర అండర్‌-16 జట్టుకి ఆడాడు వాషింగ్టన్‌. 13 ఏళ్లపుడు చెన్నైలోని 'ఎం.ఆర్‌.ఎఫ్‌. పేస్‌ ఫౌండేషన్‌'కి తీసుకువెళ్తే అతణ్ని చేర్చుకోవడమే కాదు, ఫస్ట్‌ డివిజన్‌ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇచ్చాడు కోచ్‌. ఆ లీగ్స్‌లో తనకు రెట్టింపు వయసున్న ఆటగాళ్లతో ఆడేవాడు. నిజానికి వాషింగ్టన్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌. తన అరంగేట్ర రంజీ మ్యాచ్‌లో సెంచరీ చేశాడు కూడా. టీ20 స్పెషలిస్టుగా మారడానికి ఆఫ్‌ స్పిన్‌ నేర్చుకున్నాడు. 2017లో 18 ఏళ్లకే భారత్‌ తరఫున టీ20, వన్డే ఆడాడు. 'వాషీ బౌలింగ్‌కంటే కూడా బ్యాటింగ్‌కే అభిమానిని. అతడి డ్రైవ్‌లు చూడచక్కగా ఉంటాయి' అని చెబుతుంది వాషింగ్టన్‌ సోదరి శైలజ. ఈమె కూడా తమిళనాడు మహిళా జట్టుకి ఓపెనింగ్‌ బ్యాటర్‌గా ఆడింది. ఐపీఎల్‌లో సుందర్‌ ప్రస్తుతం బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

special story on team india youngsters
ఫ్లాష్​బ్యాక్​

నాన్నే తొలి గురువు

special story on team india youngsters
గిల్

శుభ్‌మన్‌ గిల్‌ క్రికెట్‌ కెరీర్‌ కోసం పంజాబ్‌లోని చక్‌ ఖేరేవాలా అనే పల్లెనుంచి 300 కి.మీ. దూరంలోని మొహాలీకి వచ్చేశారు అతడి తల్లిదండ్రులు. అక్కడి 'పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌' స్టేడియానికి దగ్గర్లోనే ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అది కూడా గిల్‌కి ఎనిమిదేళ్లున్నపుడే. క్రికెటర్‌ అవ్వాలనేది లఖ్వీందర్‌ సింగ్‌ కల. వ్యవసాయ కుటుంబానికి చెందిన అతని ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించలేదు. కొడుక్కి క్రికెట్‌పైన ఉన్న ఇష్టాన్ని గుర్తించాక ప్రోత్సహించాలనుకున్నాడు. గిల్‌కి తొలి కోచ్‌గా మారాడు. 'మూడేళ్లప్పుడే బ్యాట్‌ పట్టుకుంటే వదిలేవాడు కాదు. వాడి ముందు ఎన్ని బొమ్మలు పెట్టినా బ్యాట్‌, బాల్‌ మాత్రమే పట్టుకునేవాడు' అని చెప్పే లఖ్వీందర్‌... గిల్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీసు కోసం బౌలర్‌గా మారి రోజూ ఆరేడు వందల బంతులు విసిరేవాడు. ఫాస్ట్‌ బౌలింగ్‌ ప్రాక్టీసు కోసం ప్లాస్టిక్‌ నవ్వారు మంచాన్ని తిరగేసి దానిమీద బంతి పడి లేచేలా విసిరేవాడు. అండర్‌-13, అండర్‌-16 ఆడుతూ వచ్చిన గిల్‌... 17 ఏళ్లకే పంజాబ్‌ తరఫున రంజీల్లో ఆడాడు. 2018లో జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌(న్యూజిలాండ్‌)లో 372 పరుగులు చేసి జట్టుకి ట్రోఫీ అందించి, 'మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్'గా ఎంపికయ్యాడు. అదే సంవత్సరం ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టు రూ.1.8 కోట్లకు గిల్‌ను సొంతం చేసుకుంది. 2018-19 రంజీ సీజన్లో తొమ్మిది ఇన్నింగ్స్‌Ëలో 728 పరుగులు చేయడం వల్ల అతణ్ని ఇండియా-ఎ జట్టులోకి తీసుకున్నాడు రాహుల్‌ ద్రవిడ్‌. బంతిని గాల్లోకి లేపకుండా గ్రౌండ్‌ షాట్లు ఆడటాన్ని ద్రవిడ్‌ శిష్యరికంలో త్వరగానే నేర్చుకున్నాడు గిల్‌. అండర్‌-19, రంజీ, ఇండియా-ఎ... ప్రతి దశలోనూ వేలకొద్దీ రన్స్‌ చేసిన గిల్‌... 2019లో టీమ్‌ ఇండియా వన్డే జట్టుకి ఎంపికైనా సుస్థిర స్థానం దక్కలేదు. తాజాగా ఆస్ట్రేలియా సిరీస్‌లో టెస్టుల్లో స్థానం దొరికినపుడు తన సత్తా చాటాడు. స్ట్రయిట్‌ బ్యాట్‌, హై ఎల్బో, తల స్థిరంగా ఉంచడంతోపాటు బంతిని ఆడటానికి కాస్త టైమ్‌ తీసుకోవడం... మేటి బ్యాట్స్‌మెన్‌ లక్షణాలు. గిల్‌లో ఇవి ప్రస్ఫుటంగా ఉన్నాయి. తన ఈడు వారితో పోల్చితే ఆటని అర్థం చేసుకోవడంలో ముందుంటాడు. అందుకే ఐపీఎల్‌ జట్టు అతడికి 'లీడర్‌షిప్‌ గ్రూప్‌'లో చోటిచ్చింది. కొత్త ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతూ యాజమాన్యానికీ కుర్రాళ్లకీ మధ్య వారధిగా పనిచేయడం అతడి బాధ్యత. 'సొంతూరునీ, తల్లిదండ్రుల్నీ వదిలి మొహాలీకి రావడం అంత సులభంగా జరగలేదు. ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలు పడ్డాం. కానీ మా కల నిజమైనందుకు సంతోషంగా ఉంది' అని చెబుతారు గిల్‌ తల్లిదండ్రులు.

ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు...

special story on team india youngsters
శార్దుల్

సాము నెల కొత్త చదువు దిన కొత్త... అని నానుడి. ఏ విద్యకైనా సాధనలో సుదీర్ఘ విరామం మంచిది కాదు. అందుకే లాక్‌డౌన్‌తో దేశమంతా స్తంభించినా మే చివర్లోనే నెట్‌ ప్రాక్టీసు మొదలుపెట్టాడు శార్దూల్‌ ఠాకూర్‌. 12 వన్డేలూ, 17 టీ20లూ ఆడిన అతడికి బ్రిస్బేన్‌ టెస్టు కెరీర్‌లో రెండోది. 2018లోనే టెస్టుల్లో అరంగేట్రం చేసిన శార్దూల్‌ కేవలం పది బంతులు వేశాక గాయంతో మైదానం వీడాడు. మరోసారి అవకాశం వస్తే వృథా చేయకూడదనేది శార్దూల్‌ పట్టుదల.

శార్దూల్‌ది మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో మహీమ్‌-కేల్వా గ్రామం. ముంబయి నుంచి 90 కి.మీ. దూరంలో ఉంటుందా ఊరు. తండ్రి నరేంద్ర రైతు. జిల్లా స్థాయి క్రికెట్‌ ఆడాడు. ఇంట్లో క్రికెట్‌ వాతావరణం ఉండటం వల్ల శార్దూల్‌ చిన్నపుడే బ్యాటూబాలూ పట్టాడు. అతడి సామర్థ్యాన్ని గుర్తించిన నరేంద్ర... ఆరో తరగతికి వచ్చాక ముంబయిలోని 'తారాపుర్‌ విద్యామందిర్‌'లో చేర్చాడు. ఉదయం అయిదింటికల్లా పాల్ఘర్‌లో ముంబయి వెళ్లే రైలెక్కేవాడు శార్దూల్‌. ఉదయం ప్రాక్టీసు, తర్వాత పాఠాలు, మళ్లీ సాయంత్రం ప్రాక్టీసు ముగించుకుని రాత్రి పదిన్నరకు ఇంటికి చేరుకునేవాడు. 'తారాపుర్‌'లో శార్దూల్‌ ప్రతిభను గుర్తించిన క్రికెట్‌ శిక్షకుడు దినేష్‌ లాడ్‌.. అతడి తల్లిదండ్రులతో మాట్లాడి తాను పనిచేస్తున్న వివేకానంద స్కూల్‌కి మార్చితే మరింత సానబెడతానన్నాడు. కోచ్‌గా దినేష్‌కు మంచి పేరుంది. ఇతడి శిష్యుల్లో రోహిత్‌ శర్మ ఒకడు. 'కావాలంటే అబ్బాయి మా ఇంటి దగ్గర ఉంటాడు' అని కూడా చెప్పాడు దినేష్‌. ఆ తర్వాత వివేకానంద స్కూల్‌కి మారాడు శార్దూల్‌. కోచ్‌ ఇంటికి మారింది బస. కోచ్‌ తనమీద పెట్టిన నమ్మకాన్ని వమ్ముచేయలేదు శార్దూల్‌. స్వల్ప వ్యవధిలోనే స్కూల్‌ జట్టులో కీలక బౌలర్‌ అయ్యాడు. 2006లో ప్రఖ్యాత హ్యారిస్‌ షీల్డ్‌ ట్రోఫీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి జట్టుని గెలిపించాడు. అదే మ్యాచ్‌లో ఆరు వికెట్లు కూడా తీశాడు. ఆరోజునుంచీ 'బౌలింగ్‌ నీ బలం, అలాగని బ్యాటింగ్‌ వదలకు' అని చెబుతూనే వచ్చాడు దినేశ్‌. ఇప్పటికీ నెట్స్‌లో బ్యాట్స్‌మెన్‌ అందరూ ప్రాక్టీసు ముగించుకుని వెళ్లాక తాను బ్యాట్‌ పట్టి కొన్ని బంతులైనా ఆడతాడు. బ్రిస్బేన్‌ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్‌(67) శార్దూల్‌దే. ఆ మ్యాచ్‌లో ఏడు వికెట్లూ పడగొట్టాడు.

కొత్త ఫినిషర్‌ దొరికాడు

special story on team india youngsters
పంత్

గబ్బాలో ఆడిన ఒక్క ఇన్నింగ్స్‌(87నాటౌట్‌)తో హీరో అయిపోయాడు రిషబ్‌ పంత్‌. అయితే అక్కడివరకూ రావడానికి ఎంతో దూరం ప్రయాణించాడు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ అతడి సొంతూరు. దిల్లీ నుంచి బస్సులో ఆరు గంటల ప్రయాణం. పదేళ్ల వయసులో క్రికెట్‌ శిక్షణ కోసం... తల్లిని తోడు తీసుకుని వారాంతాల్లో రూర్కీ నుంచి దిల్లీ వచ్చేవాడు పంత్‌. శుక్రవారం అర్ధరాత్రి తల్లీకొడుకూ బస్సెక్కి శనివారం దిల్లీలో దిగేవారు. పంత్‌ ప్రాక్టీసుకు వెళ్తే తల్లి సమీపంలోని గురుద్వారాలో వాలంటీరుగా భక్తులకు వండటం, భోజనం వడ్డించడం చేసేది. ఇద్దరూ అక్కడే ఆ రాత్రికి తలదాచుకునేవారు. ఆదివారం శిక్షణ తర్వాత తిరిగి రూర్కీ వెళ్లేవారు. అలా ఏడాది ప్రయాణించారు. యూనివర్సిటీ స్థాయిలో క్రికెట్‌ ఆడి, టీచర్‌గా స్థిరపడ్డ పంత్‌ తండ్రికి కొడుకుని క్రికెటర్‌గా చూడాలని కల. పంత్‌కి తొమ్మిదేళ్లపుడు రూ.14 వేలు పెట్టి ఎస్జీ బ్యాట్‌ కొన్నాడు. రూర్కీలో అతడి బ్యాటింగ్‌ విన్యాసాలు తెలియనివాళ్లు లేరని చెప్పాలి.

ఇండియాకి ఆడాలంటే రిషబ్‌ పూర్తిగా దిల్లీలో ఉండాల్సిందేనని నిర్ణయించుకున్న పంత్‌ కుటుంబం అక్కడికి మారింది. చిన్న గదిలోనే తల్లిదండ్రులూ, అక్కతోపాటు రిషబ్‌ ఉండేవాడు. 'సానెట్‌ క్రికెట్‌ అకాడమీ'లో కోచ్‌ తారక్‌ సిన్హా రిషబ్‌ ఆటనీ, జీవితాన్నీ మార్చేశాడు. రాజకీయాలు ఎక్కువగా ఉండే దిల్లీ జట్టులో చోటు కష్టమని కోచ్‌ సలహా మేరకు రాజస్థాన్‌ తరఫున అండర్‌-15 స్థాయి వరకూ ఆడాడు. కానీ అక్కడ స్థానికేతరుడన్న నెపంతో తర్వాత జట్టులోకి తీసుకోలేదు. అండర్‌-17 స్థాయి నుంచి దిల్లీకి మారాడు. రాజస్థాన్‌ తరఫున భారీ స్కోర్లు చేసిన పంత్‌ దిల్లీకి వచ్చాక ఫామ్‌తో ఇబ్బంది పడ్డాడు. చివరకు కోచ్‌ సలహాతో తన బ్యాటింగ్‌ శైలిని పూర్తిగా మార్చుకున్నాడు. కీపర్‌గా అదనపు నైపుణ్యాన్నీ నేర్చుకున్నాడు. అసోంతో జరిగిన ఒక అండర్‌-19 టెస్టు మ్యాచ్‌లో ఫాలో ఆన్‌ ఆడుతూ 150 పరుగులు చేసి దిల్లీ జట్టులో సుస్థిర స్థానం సంపాదించాడు. 2015లో రంజీల్లో, 2016లో అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆడాడు. 2016లో ఐపీఎల్‌లో దిల్లీ జట్టుకి ఆడే ఛాన్స్‌ కొట్టేసిన పంత్‌... టీమ్‌ ఇండియాకి ఆడటమే తరువాయి అనుకోలేదు. ఎందుకంటే, కీపర్‌గా అప్పటికే ధోనీ ఉన్నాడు. 'ధోనీకి ప్రత్యామ్నాయంగానే ఎందుకు... 11 మందిలో ఒకడిగా ఎందుకు ఉండకూడదు' అని తన ప్రణాళిక మార్చుకున్నాడు. చివరకు బ్యాట్స్‌మన్‌గానే 2017లో భారత్‌ తరఫున మొదటి టీ20 ఆడాడు రిషబ్‌. కొడుకుని నీలం రంగు జెర్సీలో చూసిన కొద్దిరోజులకే రిషబ్ తండ్రి చనిపోయాడు. నాలుగేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశాడు పంత్‌. 'నైపుణ్యంలో రిషబ్‌ని వేలెత్తి చూపడానికి లేదు, కానీ షాట్‌ సెలక్షన్‌లోనే నిర్లక్ష్యం కనిపిస్తోంది' అని పండితుల నుంచి అభిమానుల వరకూ అందరూ అనేవారు. వయసుతో పాటు పరిణతి వస్తుందంటారు. అది పంత్‌ విషయంలో ఆస్ట్రేలియా పర్యటనలో ప్రస్ఫుటంగా కనిపించింది. ధోనీ తర్వాత మరో కొత్త ఫినిషర్‌ దొరికాడని అంతా మెచ్చుకుంటున్నారు.

ఇదీ చూడండి: 'భారత ఆటగాళ్లు భళా.. మావోళ్లలో విషయం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.