ETV Bharat / sports

సన్​రైజర్స్ హైదరాబాద్​ ఆటగాళ్లకు ప్రత్యేక కిట్

కొవిడ్​ నుంచి సన్​రైజర్స్ హైదరాబాద్​ క్రికెటర్లకు పూర్తి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక కిట్​ను తయారు చేశారు. ఇది 99.9 శాతం వైరస్​ను నిరోధించగలుగుతుందని సదరు సంస్థ వెల్లడించింది.​

సన్​రైజర్స్ హైదరాబాద్​ ఆటగాళ్లకు ప్రత్యేక కిట్!
sunrisers hyderabad
author img

By

Published : Aug 28, 2020, 7:19 PM IST

ఐపీఎల్​లో పాల్గొనేందుకు క్రికెటర్లు, ఇప్పటికే దుబాయ్​ చేరుకున్నారు. అయితే వారికి వైద్యపరీక్షల్లో నెగటివ్ వచ్చినా సరే, ఆ తర్వాత వైరస్​ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎలా? సరిగ్గా ఇదే విషయమై ఆలోచించిన సన్​రైజర్స్ హైదరాబాద్​ మేనేజ్​మెంట్.. జట్టు సభ్యులు ధరించేందుకు ప్రత్యేక కిట్​ను పంజాబ్​ జలంధర్​లో​ తయారు చేయించింది. 99.9 శాతం కరోనా రాకుండా ఇది నిరోధిస్తుందని సదరు సంస్థే వెల్లడించింది.

సన్​రైజర్స్ హైదరాబాద్​ ఆటగాళ్లకు ప్రత్యేక కిట్ తయారీ

కరోనా ప్రభావం ఎక్కువ కావడం వల్ల భారత్​లో జరగాల్సిన ఐపీఎల్.. ఈ ఏడాది దుబాయ్​లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. సెప్టెంబరు 19 నుంచి నవంబర్ 10 వరకు మ్యాచ్​లు జరగనున్నాయి.

ఇప్పటికే జట్లలోని ఆటగాళ్లందరూ ఆరు రోజుల క్వారంటైన్​ ముగించుకుని ప్రాక్టీసు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో దుబాయ్​లో కరోనా కేసులు కూడా పెరుగుతుండటం కాస్త కలవరపరిచే విషయం.

Sunrisers Hyderabad
సన్​రైజర్స్ హైదరాబాద్​ ఆటగాళ్లు(పాత చిత్రం)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.