సఫారీ స్పీడ్ గన్ డేల్ స్టెయిన్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోమవారం ఈ మేరకు ప్రకటన చేశాడు. వన్డే, టీ20ల్లో మాత్రం కొనసాగనున్నట్లు ఈ 36 ఏళ్ల దక్షిణాఫ్రికా ఆటగాడు చెప్పాడు. పరిమిత ఓవర్ల కెరీర్‌పై మరింత దృష్టి సారించేందుకే ఐదు రోజుల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు స్టెయిన్ తెలిపాడు.
" నేను బాగా ప్రేమించే టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నా. క్రికెట్లో 5 రోజుల ఆటే అత్యుత్తమం అని భావిస్తా. ఎప్పటికీ టెస్టులు ఆడననే ఊహ భయంగా ఉంది. ఇప్పటి నుంచి వన్డే, టీ20లపై పూర్తి దృష్టి పెడతా. నా సామర్థ్యాన్ని వినియోగించి ఎక్కువ కాలం పాటు ఆటలో కొనసాగేందుకు ప్రయత్నిస్తా. పొట్టి ఫార్మాట్లో ప్రొటీస్ జట్టు తరఫున మరింత రాణిస్తాను ".
-డేల్ స్టెయిన్, దక్షిణాఫ్రికా బౌలర్
-
The #SteynRemover coming at your head at 150kph. We’ll miss you in test whites mate. 🚀 @DaleSteyn62 #DaleSteyn #ProteaFire #Cricket #SouthAfrica pic.twitter.com/kUjTixoSAs
— Jason Maidwell (@JayMasterJ1) August 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The #SteynRemover coming at your head at 150kph. We’ll miss you in test whites mate. 🚀 @DaleSteyn62 #DaleSteyn #ProteaFire #Cricket #SouthAfrica pic.twitter.com/kUjTixoSAs
— Jason Maidwell (@JayMasterJ1) August 5, 2019The #SteynRemover coming at your head at 150kph. We’ll miss you in test whites mate. 🚀 @DaleSteyn62 #DaleSteyn #ProteaFire #Cricket #SouthAfrica pic.twitter.com/kUjTixoSAs
— Jason Maidwell (@JayMasterJ1) August 5, 2019
15 ఏళ్ల కెరీర్...
2004లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన స్టెయిన్... ఈ ఏడాది ఫిబ్రవరిలో తన చివరి టెస్టు శ్రీలంకపై ఆడాడు. 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 93 టెస్టులు ఆడిన స్టెయిన్... 22.95 సగటుతో 439 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు అతడి సొంతం. మొత్తంగా టెస్టుల్లో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.
ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టులో స్టెయిన్ చోటుదక్కించుకున్నా... భుజం గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి...క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు మెక్కల్లమ్ వీడ్కోలు