భారత మహిళా జట్టుతో జరుగుతోన్న తొలి టీ20లో దక్షిణాఫ్రికా అమ్మాయిలు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది.
టీమిండియా సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలిగిన తర్వాత జరుగుతోన్న ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరుజట్ల మధ్య 5 టీ-20లు జరగనున్న నేపథ్యంలో ఇందులో నెగ్గాలని చూస్తోంది హర్మన్ సేన.
జట్లు:
భారత్:
హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మందాణ్న, షఫాలీ శర్మ, రోడ్రిగ్స్, వేద కృష్ణమూర్తి, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ, పూజా, తానియా భాటియా(కీపర్), రాధా యాదవ్, శిఖా పాండే.
దక్షిణాఫ్రికా:
సనే లూస్(కెప్టెన్), లీజెల్లే లీ(కీపర్), తాజ్మిన్ బ్రిట్స్, లోరా, నాడిని, మిగ్నన్ డుప్రీజ్, షాంగేజ్, లాబా, షబ్నమ్ ఇస్మాయిల్, ఖాకా, తుమి
ఇదీ చదవండి: ఒలింపిక్ పతకం అంత సులభం కాదు: గ్రాహం రీడ్