ETV Bharat / sports

తొలి టీ20లో భారత్​పై దక్షిణాఫ్రికా విజయం - తొలి టీ20

భారత్​తో జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్​ ఇండియా నిర్ణీత ఓవర్లలో 130 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది .

South Africa won the first T20 against India by 8 wickets.
తొలి టీ20లో భారత్​పై దక్షిణాఫ్రికా విజయం
author img

By

Published : Mar 20, 2021, 10:05 PM IST

భారత్​తో జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు గెలుపొందింది. టాస్​ ఓడి తొలుత బ్యాటింగ్​ చేసిన టీమ్​ఇండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. హర్లీన్​ డియోల్​ హాఫ్ సెంచరీతో రాణించగా.. రోడ్రిగ్స్​, షెఫాలీ వర్మ ఆకట్టుకున్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో శబ్నిమ్​ ఇస్మాయిల్​ 3, అన్నేకే బోస్క్ 2 వికెట్లు తీశారు.

అనంతరం ఛేదన​కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 19.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పర్యటక జట్టు బ్యాట్స్​ఉమెన్​లలో అన్నేకే బోస్క్​ అర్ధ సెంచరీతో రాణించింది. కెప్టెన్ సునే లూస్​ 47 పరుగులతో ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడింది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్​ల సిరీస్​లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సిరీస్​లో తదుపరి మ్యాచ్​ ఆదివారం జరగనుంది.

ఇదీ చదవండి: కుమ్మేసిన టీమ్​ఇండియా.. ఇంగ్లాండ్ లక్ష్యం 225

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.