దక్షిణాఫ్రికా-బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ మధ్య వార్మప్ మ్యాచ్ నేడు ప్రారంభమైంది. కానీ తొలిరోజే వర్షం కారణంగా ఒక్క ఓవర్ పడకుండానే ఆట తుడిచిపెట్టుకుపోయింది. విజయనగరం వేదికగా జరగుతోన్న ఈ మ్యాచ్‌లో ఇంకా రెండు రోజులు మిగిలి ఉన్నాయి.
-
Play for Day 1 of the Proteas 3-day warm-up match has been called off. #ProteasWarmUp pic.twitter.com/Z2boGEXfJA
— Cricket South Africa (@OfficialCSA) September 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Play for Day 1 of the Proteas 3-day warm-up match has been called off. #ProteasWarmUp pic.twitter.com/Z2boGEXfJA
— Cricket South Africa (@OfficialCSA) September 26, 2019Play for Day 1 of the Proteas 3-day warm-up match has been called off. #ProteasWarmUp pic.twitter.com/Z2boGEXfJA
— Cricket South Africa (@OfficialCSA) September 26, 2019
టెస్టు సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు ఇదొక్కటే ప్రాక్టీస్ మ్యాచ్. పరిస్థితులపై అవగాహన కల్పించుకునేందుకు సఫారీ జట్టుకు ఇదో మంచి అవకాశం.
టెస్టుల్లో సుస్థిర స్థానం కోసం ఎదురుచూస్తోన్న టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మకు ఈ ప్రాక్టీస్ మ్యాచ్ కీలకం కానుంది. విశాఖపట్నం వేదికగా వచ్చే నెల 2న ప్రారంభం కాబోతున్న మొదటి టెస్టులో తొలిసారిగా ఓపెనర్‌గా బరిలోకి దిగబోతున్నాడు హిట్‌మ్యాన్. అలాగే మయాంక్ అగర్వాల్, ఉమేశ్ యాదవ్ సత్తా చాటాలని భావిస్తున్నారు.
ఇవీ చూడండి.. ఒక్క ఛాన్స్ ఇవ్వమని.. బతిమాలా: సచిన్