ప్రపంచకప్‌లో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయిన దక్షిణాఫ్రికా... ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ ముందు ఆ దేశ క్రికెట్‌ను కాపాడుకునే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మాజీ సారథి గ్రేమ్ స్మిత్‌ను బోర్డు డైరెక్టర్‌గా, మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్‌ను కోచ్‌గా నియమించింది. ప్రస్తుతం స్టార్ క్రికెటర్లు డివిలియర్స్ వంటి ఆటగాళ్ల సేవలు వినియోగించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి సమయంలో ఊహించని షాకిచ్చాడు స్టార్ ఆల్‌రౌండర్ జేపీ డుమిని. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకూ గుడ్‌బై చెప్తూ.. సోమవారం ప్రకటన చేశాడు.
2018 ప్రపంచకప్ ఆఖరు
గత ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న డుమిని.. ఆ తర్వాత పలు టీ20 లీగ్‌ల్లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే ఈ రోజు మాత్రం ఇకపై ఏ ఫార్మాట్‌లోనూ క్రికెట్ ఆడబోనంటూ ప్రకటించేశాడు. ఫలితంగా 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు శాశ్వతంగా బ్రేక్ పడింది.
చాలా ఏళ్లు మిడిలార్డర్‌లో రాణించిన ఇతడు... యువ క్రికెటర్లకు అవకాశమివ్వాలనే ఉద్దేశంతో క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో బాగానే అనిపిస్తున్నా... మైదానంలో తన ప్రదర్శనపై అసంతృప్తిగా ఉన్నట్లు చెప్పాడు.
" నాలో ఇంకా ఆట ఆడే సత్తా ఉంది. టీ20 మ్యాచ్‌లు ఆడితే ఫ్రాంఛైజీలు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తాయి. కానీ ఆడేందుకు బలమైన కారణంగా కనిపించట్లేదు. కాబట్టి అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువ క్రికెటర్ల కోసం నేను వైదొలుగుతున్నా".
--జేపీ డుమిని, దక్షిణాఫ్రికా క్రికెటర్
2004 ఆగస్టులో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన డుమిని.. దక్షిణాఫ్రికా తరఫున 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.