ETV Bharat / sports

'పొట్టి ఫార్మాట్​కు గంగూలీ తగిన వాడు కాదు' - గంగూలీ లేటెస్ట్​ న్యూస్​

టీ20 మ్యాచ్​ల​కు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ సౌరభ్​ గంగూలీ సరిపోడని అభిప్రాయపడ్డాడు కోల్​కతా నైట్​రైడర్స్​ మాజీ కోచ్​ జాన్​ బుచానన్​. ఐపీఎల్​ వంటి టోర్నీల్లో గంగూలీ త్వరగా నిర్ణయాలు తీసుకోలేకపోయేవాడని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Sourav Ganguly was not suited to T20 cricket, says former KKR coach John Buchanan
'పొట్టి ఫార్మాట్​కు గంగూలీ తగిన వాడు కాదు'
author img

By

Published : Aug 30, 2020, 12:47 PM IST

టీ20 ఫార్మాట్​కు టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ సౌరభ్​ గంగూలీ సరిపోతాడనే విషయంపై తనకు నమ్మకం లేదని కోల్​కతా నైట్​రైడర్స్​ మాజీ కోచ్​ జాన్​ బుచానన్​ అన్నాడు. భారత్​కు చెందిన దిగ్గజ ఆటగాళ్లలో గంగూలీ ఒకడైనా.. ఐపీఎల్​ లేదా టీ20 మ్యాచ్​లకు అతను సరిపోడని అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని తాను దాదాతోనూ చర్చించినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. టీ20ల్లో మైదానంలోనే త్వరగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని.. అందుకు గంగూలీ సిద్ధంగా లేడని పేర్కొన్నాడు.

"కెప్టెన్​గా టీ20 మ్యాచ్​ల్లో త్వరగా నిర్ణయాలు తీసుకునే అవసరం ఉంటుంది. పొట్టి ఫార్మాట్​కు తగ్గట్టుగా ఆటగాళ్ల ఆటతీరు, ఆలోచనలలో మార్పు రావాలి. అందుకే సౌరభ్​ గంగూలీతో నేను ఈ విషయం గురించి మాట్లాడా. అతను ఈ ఫార్మాట్​ కోసం సరిపోతాడని నేను అనుకోను."

-జాన్ బుచానన్​, కోల్​కతా నైట్​రైడర్స్​ మాజీ కోచ్​

2008లో జరిగిన ఐపీఎల్ తొలి సీజన్​లో​ గంగూలీ, కోచ్​ జాన్​ బుచానన్​ కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టుకు కలిసి పని చేశారు. ఆ లీగ్​లో కోల్​కతా ఆరో స్థానంలో నిలిచింది. అప్పుడు గంగూలీ కెప్టెన్సీతో బుచానన్​ సంతృప్తిగా లేకపోవడం వల్ల 2009లో కెప్టెన్​గా బ్రెండన్​ మెక్​కలమ్​ను​ ఎంచుకుంది ఫ్రాంచైజీ. ఆ సీజన్​లో జట్టు చివరి స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత బుచానన్​ను కోచ్​ పదవి నుంచి తొలగించింది కేకేఆర్​ యాజమాన్యం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.