ETV Bharat / sports

'బుధవారం గంగూలీ డిశ్చార్జ్​'

author img

By

Published : Jan 4, 2021, 4:49 PM IST

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీని బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ చేస్తామని వుడ్​ల్యాండ్స్​ సీఈఓ డా.రూపాలీ బసు వెల్లడించారు. దాదా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉండడం వల్ల మరోసారి యాంజియోప్లాస్టీ చేయాలన్న నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నామని తెలిపారు.

Sourav Ganguly stable, likely to be discharged on Jan 6: Hospital
'గంగూలీని బుధవారం డిశ్చార్జ్​ చేస్తాం'

గుండెపోటుతో ఇటీవలే ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వుడ్​ల్యాండ్స్​ వైద్యులు వెల్లడించారు. బుధవారం దాదాను డిశ్చార్జ్​ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తొమ్మిది మందితో కూడిన వైద్యుల బృందం నేడు సమావేశమైంది. ఈ మీటింగ్​కు దాదా కుటుంబసభ్యులు కూడా హాజరయ్యారు. వ్యాధి, చికిత్సా విధానం గురించి డాక్టర్లు వారికి వివరణ ఇచ్చారు

గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉండడం వల్ల మరోసారి యాంజియోప్లాస్టీ చేయాలనే ఆలోచనను వాయిదా వేస్తున్నట్లు వుడ్​ల్యాండ్స్​ ఆస్పత్రి సీఈవో డాక్టర్​ రూపాలీ బసు స్పష్టం చేశారు. కానీ మరో వారం రోజుల్లో మరోసారి యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని గంగూలీ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మంగళవారం లేదా బుధవారం డిశ్చార్జ్​ చేస్తామని వైద్యులు తెలిపారు.

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్​ ఠాకూర్​, బీసీసీఐ సెక్రటరీ జైషా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గంగూలీని పరామర్శించారు.

ఇదీచూడండి: 'గంగూలీకి బైపాస్​ సర్జరీ అవసరం లేదు'

గంగూలీ హెల్త్ అప్​డేట్.. మెరుగ్గా ఆరోగ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.