ఐపీఎల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. 'మై కొవిడ్ హీరోస్' అని టీషర్టుపై రాసి, కరోనాతో పోరాటం చేస్తున్న యోధులకు సంఘీభావం ప్రకటించింది. ఆ ఫొటోను కోహ్లీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.
అహర్నిశలు శ్రమిస్తోన్న కరోనా యోధుల త్యాగాలు, వారి సేవలను గుర్తించి గౌరవించడంలో భాగంగా ఈ సీజన్ టోర్నీ ముగిసేవరకు ఆర్సీబీ బృందం కొత్త జెర్సీలు వేసుకోనుంది. తమ జట్టు ఆడే మొదటి మ్యాచ్‌లో ఆటగాళ్లు ధరించే జెర్సీలను వేలం వేసి, వాటి ద్వారా వచ్చే నగదును గివ్ ఇండియా ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
కోహ్లీ తప్పుడు నిర్ణయం వల్లే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్లో ఒక్కసారి టైటిల్ గెలవకపోవడానికి గల కారణాలను వివరించాడు ఆ జట్టు మాజీ కోచ్ రే జెన్నింగ్స్. సారథి కోహ్లీ, గతంలో కొన్నిసార్లు ఫామ్‌లో లేని ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడం కూడా ఓ కారణమని అభిప్రాయపడ్డాడు.
"ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ చాలా భిన్నం. ఆరు వారాల వ్యవధిలో కొంతమంది ఆటగాళ్లు ఫామ్ అందుకుంటారు. మరికొందరు ఫామ్ కోల్పోవచ్చు. ధాటిగా ఆడే క్రమంలో త్వరగానే పెవిలియన్ చేరొచ్చు. అందుకే జట్టులో నిలకడైన ఆటగాడు కావాలి. నేను కోచ్‌గా ఉన్నప్పుడు కొంతమంది ఆటగాళ్లు అలానే ఆడేవారు. అలాంటి వారిని ఎంచుకోవడానికి నేను ప్రయత్నించేవాడిని. దీంతోపాటే కొందరు ఆటగాళ్లు కొన్ని పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ లేదా బ్యాటింగ్ చేయాలని అనుకునేవాడిని. అయితే కోహ్లీ ఆలోచనలు భిన్నంగా ఉండేవి. అలా విరాట్ కొన్నిసార్లు ఫామ్‌లో లేనివారికి మద్దతు ఇచ్చాడు. కానీ ఆ విషయంలో అతడిని నిందించలేం. ఏదేమైనా అది గతం. అతడు రోజు రోజుకు రాటుదేలడం ఆనందంగా ఉంది. ఐపీఎల్లో విజయం సాధిస్తాడని భావిస్తున్నాను"
- జెన్నింగ్స్, ఆర్సీబీ మాజీ కోచ్
2009 నుంచి 2014 వరకు బెంగళూరు జట్టుకు కోచ్‌గా ఉన్నాడు జెన్నింగ్స్. 5,412 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు. ఈసారి వేలంలో ఆరోన్ ఫించ్, జోష్ ఫిలిప్పి, క్రిస్ మోరిస్, డేల్ స్టెయిన్, ఆడమ్ జంపాలను తీసుకుని జట్టును పటిష్టం చేసింది. సెప్టెంబరు 21న తమ తొలి మ్యాచ్ హైదరాబాద్‌తో ఆడనుంది కోహ్లీసేన.
ఇదీ చూడండి వాళ్లు లేకపోవచ్చు.. మేం రెచ్చిపోవడం పక్కా : కోహ్లీ