ETV Bharat / sports

మాకు ఏదో అయింది: పాక్ కోచ్ మిస్బా - misbah ul haq

శ్రీలంక చేతిలో 0-3 తేడాతో సిరీస్ చేజార్చుకోవడంపై స్పందించాడు పాకిస్థాన్ ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్. తమ జట్టుకు ఏదో అయిందని, అందుకే అన్ని విభాగాల్లో వైఫల్యం చెందామని అన్నాడు.

మిస్బా ఉల్ హక్
author img

By

Published : Oct 10, 2019, 12:45 PM IST

సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్​లో 0-3 తేడాతో ఘోరపరాభావం చెందింది పాకిస్థాన్. ఈ ప్రదర్శనపై ఆ జట్టు ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. పాక్​​ క్రికెట్ వ్యవస్థకు ఏదో అయిందని, అయితే ఈ సిరీస్ తమ కళ్లు తెరిపించిందని అన్నాడు.

"ఇదే జట్టు మమ్మల్ని అగ్రస్థానం​లో నిలబెట్టింది. కానీ ఈ సిరీస్ మా కళ్లు తెరిపించింది. ఇప్పుడున్న ఆటగాళ్లు.. మూడు, నాలుగేళ్లుగా జట్టులో ఆడుతున్నారు. పాకిస్థాన్ క్రికెట్ వ్యవస్థకు ఏదో అయింది. ఈ ఓటమితో మేము నెంబర్ వన్ అని ఎలా అనుకోగలం" -మిస్బా ఉల్ హక్​, పాక్ ప్రధాన కోచ్, ఛీఫ్ సెలక్టర్

అయితే ఈ సిరీస్​లో అన్ని విభాగాల్లోనూ పేలవ ప్రదర్శన చేశామని చెప్పాడు కోచ్ మిస్బా.

"ఈ సిరీస్ ఏకపక్షంగా సాగింది. మేం కనీస పోటీ ఇవ్వలేకపోయాం. ప్రతి విభాగంలో విఫలమయ్యాం. శ్రీలంక అద్భుతంగా ఆడింది. అయితే ఈ ఓటమి చాలా నిరుత్సాహపరిచింది. ఇందుకు పూర్తి బాధ్యత నేను తీసుకుంటా" -మిస్బా ఉల్ హక్​, పాక్ ప్రధాన కోచ్, ఛీఫ్ సెలక్టర్

పాకిస్థాన్ కోచ్ అయిన దగ్గరి నుంచి మిస్బాపైనే అందరి దృష్టి సారించారు. ప్రధాన కోచ్​తో పాటు ఆ జట్టు ఛీఫ్​ సెలక్టర్​గానూ మిస్బాకు బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వచ్చాయి. పాకిస్థాన్​ క్రికెట్​లోని అత్యున్నత పదవులు రెండూ ఒకే వ్యక్తి ఇవ్వడమేంటని పలువురు ప్రశ్నించారు.

Something wrong with Pakistan's cricket system: Misbah
విజయోత్సాహంలో లంక జట్టు

పాకిస్థాన్‌తో బుధవారం జరిగిన మూడో టీ20ను గెలిచి సిరీస్​ను క్లీన్‌స్వీప్‌ (3-0) చేసింది శ్రీలంక. ఒషాడ ఫెర్నాండో (78) చెలరేగి ఆడి లంకను గెలిపించాడు. ఈ మ్యాచ్​లో 13 పరుగుల తేడాతో పాక్‌ ఓడిపోయింది. తొలుత శ్రీలంక 7 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఛేదనలో 6 వికెట్లకు 134 పరుగులే చేయగలిగింది పాకిస్థాన్‌. సొహైల్‌ (52) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఇదీ చదవండి: ప్రపంచ ఛాంపియన్​షిప్​ సెమీస్​లో మేరీ కోమ్​

AP Video Delivery Log - 0500 GMT News
Thursday, 10 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0445: Australia Netherlands No Access Australia 4234019
Rutte discusses US-China rivalry at think-tank
AP-APTN-0420: China US Visas AP Clients Only 4234018
MOFA: Not aware of visa restrictions on US nationals
AP-APTN-0414: Australia US China No Access Australia 4234017
US Sec of Commerce: China has become more protectionist
AP-APTN-0411: US AK Climate Change Part must credit Alaska Court System 4234016
Alaska Supreme Court hears climate change lawsuit
AP-APTN-0329: US Trump Foreign Fighters AP Clients Only 4234014
Trump on foreign IS fighters; WH call monitoring
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.