ఈ మిలీనియంలో(2000 సంవత్సరం తర్వాత) ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా స్టీవ్ స్మిత్ రికార్డు సృష్టించాడు. 110.57 సగటుతో 774 పరుగులు చేశాడు స్మిత్. భారత్‌పై 2014-15 సీజన్లో తాను చేసిన 769 పరుగుల రికార్డును తానే తిరగరాశాడు.
ఏడు ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత అందుకున్నాడు స్మిత్. ఇందులో మూడు శతకాలు(144, 142, 211), మూడు అర్ధశతకాలు(92,82,80) ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఓ యాషెస్‌లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఆఖరి ఇన్నింగ్స్‌లో తప్ప ప్రతి ఇన్నింగ్స్‌లోనూ కనీసం 50 పరుగులు చేశాడు స్మిత్.
అవమానించిన చోటే.. అభినందనలు..
బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న స్టీవ్ స్మిత్ యాషెస్ సిరీస్‌లో పునరాగమనం చేశాడు. అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ప్రపంచకప్, యాషెస్ సిరీస్‌లో స్మిత్ బ్యాటింగ్‌కు దిగుతున్నపుడు చీటర్ అంటూ ఇంగ్లీష్ అభిమానులు ఎగతాళి చేసినా పట్టించుకోలేదు స్మిత్. ఇప్పుడు అందరి గౌరవం అందుకున్నాడు. ఆఖరి టెస్టు చివరి ఇన్నింగ్స్‌లో అతడు ఔటై వెళ్లి పోతుంటే అందరూ లేచి చప్పట్లు కొట్టి అభినందించారు.
-
Give a call to Dhoni. See if he’s ready to take students 🤣😂 Dhoni Review System. https://t.co/kcfuH1S6tQ
— Aakash Chopra (@cricketaakash) September 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Give a call to Dhoni. See if he’s ready to take students 🤣😂 Dhoni Review System. https://t.co/kcfuH1S6tQ
— Aakash Chopra (@cricketaakash) September 15, 2019Give a call to Dhoni. See if he’s ready to take students 🤣😂 Dhoni Review System. https://t.co/kcfuH1S6tQ
— Aakash Chopra (@cricketaakash) September 15, 2019
ఓ యాషెస్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
- 1930లో సర్ డాన్‌బ్రాడ్‌మన్(ఆస్ట్రేలియా) 974 పరుగుల చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఇందులో 4 శతకాలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 334.
- 1928-29 సీజన్లో వాల్లీ హమ్మాండ్(ఇంగ్లాండ్) 905 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 251.
- 1989లో మార్క్ టేలర్(ఆస్ట్రేలియా) 839 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 219
- 1936/37 సీజన్లో 810 పరుగలు చేసి నాలుగోస్థానంలో ఉన్నాడు బ్రాడ్‌మన్. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 270.
- ప్రస్తుతం ఈ సీజన్లో స్టీవ్ స్మిత్(ఆసీస్) 110.57 సగటుతో 774 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 211.
- 2010/11 సీజన్లో అలెస్టర్ కుక్ 766 పరుగుల చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 235.
ప్రస్తుతం జరిగిన యాషెస్ సిరీస్ చివరి టెస్టులో 363 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 263 పరుగులకే కుప్పకూలింది. 2-2 తేడాతో సిరీస్ డ్రాగా ముగిసింది. గత సీజన్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియానే యాషెస్ టైటిల్‌ను కాపాడుకుంది.
ఇదీ చదవండి: 'నీ మద్దతుకు ధన్యవాదాలు.. ఐ లవ్ యూ'