ఐపీఎల్ ఉత్తమ కెప్టెన్లుగా మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మలను సంయుక్తంగా ఎంపిక చేసింది స్టార్‌స్పోర్ట్స్ నిపుణుల జ్యూరీ. గౌతమ్ గంభీర్, సంజయ్ బంగర్, కెవిన్ పీటర్సన్, డేని మోరిసిన్ జ్యూరీ మెంబర్స్‌గా ఉన్న కమిటీలో ఇద్దరు ధోనీకి మరో ఇద్దరు రోహిత్‌కు ఓటు వేశారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన టీమ్ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ధోనీ కంటే రోహిత్ ఉత్తమ కెప్టెన్ అని స్పష్టం చేశాడు.
"ఐపీఎల్లో ఎన్నో ఉత్కంఠ మ్యాచ్‌లు గెలిచింది ముంబయి ఇండియన్స్. అదే రోహిత్ కెప్టెన్సీకి నిదర్శనం. ఒత్తిడిలోనూ అతడు తీసుకునే నిర్ణయాలు చాలా బాగుంటాయి. కెప్టెన్సీ పరంగా, నిర్ణయాలు తీసుకునే పరంగా రోహిత్‌కే నా ఓటు."
-సంజయ్ బంగర్, టీమ్ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా రోహిత్ కెప్టెన్సీకి మద్దతు తెలిపాడు. ధోనీ కంటే రోహిత్ ఉత్తమ కెప్టెన్ అని అన్నాడు. అతడు ఇప్పటికే జట్టుకు నాలుగు టైటిల్స్ అందించాడని గుర్తు చేశాడు.